ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా  వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే . భారీగా కేసులు పెరిగిపోతూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా మహమ్మారి వైరస్ ను  మాత్రం కట్టడి చేయలేక పోతుంది ప్రభుత్వం. కొంతమంది నిర్లక్ష్యం కారణంగా ఎంతోమంది ప్రాణాపాయ స్థితిలో కి వెళ్లి పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది అనే చెప్పాలి. అక్కడ రోజు రోజుకు కనీసం 50 కి పైగా కొత్త పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కర్నూలు జిల్లాలో మొత్తం రెడ్ జోన్  గా ప్రకటించింది ఏపీ సర్కార్. అక్కడ నిబంధనలు మరింత కఠినతరం చేశారు. 

 

 

 అయినప్పటికీ అక్కడ రోజురోజుకు కరోనా  వైరస్ కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కఠిన నిబంధనల అమలు చేసిన... ప్రజలందరూ ఇంటికే పరిమితం అయ్యేలా ఎన్ని చర్యలు చేపట్టినా ఎక్కడ ప్రయోజనం మాత్రం కనిపించడం లేదు. రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా  వైరస్ కేసులతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే అటు  విజయవాడలో కూడా  పరిస్థితి మరింత దారుణంగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విజయవాడ రెడ్ జోన్  పరిధిలోకి వచ్చింది. విజయవాడలో భారీగా కరోనా  వైరస్ కేసులు నమోదవుతున్న దృశ్య... అక్కడ నిషేధాజ్ఞలను మరింత కఠినతరం చేసింది ప్రభుత్వం. 

 

 

 అయితే మామూలుగా అయితే కరోనా  వైరస్ ను నివారించాలి అంటే సామాజిక దూరం తప్పనిసరి. ఎక్కడ జనాలు గుమిగూడి కనిపించకూడదు. ఈ క్రమంలోనే విజయవాడలోని రైతు బజార్లు అన్నింటినీ మూసివేసి జనం గుమికూడికుండా ఉండేలా తగిన చర్యలు చేపడుతుంది. ఉదయం 9 గంటల వరకు మాత్రమే రహదారుల పక్కన పండ్లు కూరగాయలు అమ్మే ఏర్పాట్లు చేశారు అధికారులు. కృష్ణలంక ప్రాంతం కూడా గత నెల రోజుల నుంచి రెడ్ జోన్ లో ఉన్నది. అయితే కృష్ణలంక ప్రాంతానికి అరకిలోమీటరు దూరం కూడా లేని బందరు రోడ్డులో... ఆశ్చర్యకరమైన నిర్లక్ష్యమైనా  దృశ్యం ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. మార్కెట్ వద్ద విపరీతమైన రద్దీ నెలకొనడం  ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇలా అయితే కరోనా  కొనసాగడం తప్ప తగ్గడం మాత్రం ఎక్కడా జరగదు అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: