కరోనాను కట్టడి చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ముఖ్యమంగా కరోనా టెస్టుల సంఖ్య గణనీయంగా పెంచుతూ వాస్తవ పరిస్థితిని అంచనా వేస్తోంది. కరోనా పరీక్షల విషయంలో ఏపీ సర్కారు రికార్డులు సృష్టిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పది లక్షల జనాభాకు 2,345 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

 

 

ఇది దేశంలోనే మరో రికార్డు.. ఎందుకంటే.. ఢిల్లీలో ప్రతి పది లక్షల జనాభాకు 2,224 మందికి కరోనా వైరస్ ‌పరీక్షలు నిర్వహించారు. ఇక తమిళనాడులో ప్రతి మిలియన్‌కు 1929 పరీక్షలు నిర్వహించారు. అటు రాజస్థాన్‌లో ప్రతి మిలియన్‌కు 1402 అధికారులు పరీక్షలు నిర్వహించారు. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ప్రతి మిలియన్ కు 2345 పరీక్షలు నిర్వహించారు.

 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 10, 229 పరీక్షలు నిర్వహించగా ఆదివారం నాటికి మొత్తం 1,25,229 పరీక్షలు నిర్వహించారు. పరీక్షల విషయంలోనే కాదు.. కరోనా కట్టడిలోనూ ఏపీ మంచి గణాంకాలే నమోదు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కరోనా పాజిటివ్‌ కేసుల శాతం 1.32 ఉండగా దేశం మొత్తంలో 3.84 ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 2 శాతం కాగా.. దేశంలో 3.27 గా ఉంది.

 

 

కరోనా పరీక్షల కోసం కొరియా నుంచి దిగుమతి చేసుకున్న కిట్లతో పాటు.. మరో 45 కేంద్రాల్లో 3245 ట్రూనాట్‌ మిషన్లు కూడా పని చేస్తున్నాయి. గతంలో ఇవి 245 ఉండవి. వీటిని మరో వంద పెంచి 11 ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌ల్లో 22 మిషిన్లతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి జిల్లాలో కూడా 4 మిషన్లు ఉంచాలని ప్రభుత్వం ప్రయత్నస్తోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: