నందమూరి నట వారసుడిగా తాతకు తగ్గ మనవడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఫుల్ గా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ దూసుకుపోతున్న హీరో జూనియర్ ఎన్టీఆర్ కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అద్వితీయమైన అద్భుతమైన నటనకు నిలువెత్తు రూపం జూనియర్ ఎన్టీఆర్. తాతకు తగ్గ మనవడిగా ఎంతో పేరుతెచ్చుకున్నారు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి ఎన్నో విజయాలను సొంతం చేసుకుని స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు జూనియర్ ఎన్టీఆర్. అయితే ప్రస్తుతం స్టార్ హీరోగా దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ కు పునాదులు వేసింది దర్శకధీరుడు రాజమౌళి. 

 

 

 ఇక అప్పటి వరకూ బుల్లితెరపై ధారావాహికలలో తన సత్తా చాటిన రాజమౌళి కూడా మొదటిసారి స్టూడెంట్ నెంబర్ 1 సినిమా తో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమయ్యాడు. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పరిచయమయ్యాడు. దీంతో స్టూడెంట్ నెంబర్ 1 సినిమా అటు దర్శకుడు ఇటు హీరోకి ఇద్దరు కెరియర్ కి పునాది రాళ్లుగా మారి పోయింది అన్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ మొదటి సినిమాగా వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పట్లోనే రాజమౌళి తన దర్శకత్వ నైపుణ్యాన్ని చూపించి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. 

 

 

 దీంతో స్టూడెంట్ నెంబర్ 1 సినిమా కేవలం జూనియర్ ఎన్టీఆర్ కెరియర్కి పునాదులు వేసి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. అలా చేయడమే కాదు అటు దర్శకధీరుడు కూడా మంచి సక్సెస్ సాధించడంతో కెరియర్ పరంగా బాగా కలిసొచ్చింది. ఇక అందుకే స్టూడెంట్ నెంబర్ 1 సినిమా అటు  జూనియర్ ఎన్టీఆర్ ఇటూ  దర్శక ధీరుడు రాజమౌళి ఇద్దరికి ఒక మైలురాయి లాంటిది అని చెప్పవచ్చు. ఇద్దరికీ మొదటి సినిమా అయినప్పటికీ నటనలో జూనియర్ ఎన్టీఆర్... దర్శకత్వంలో దర్శక ధీరుడు రాజమౌళి తమ సత్తా చాటి ప్రేక్షకులను మెప్పించి మంచి విజయాన్ని అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: