ప్రపంచంలో ఎప్పుడైతే కరోనా వైరస్ మొదలైందో.. ప్రతి మనిషి తన మనశ్శాంతి కోల్పోయారు. ఐనవారు దూరమవుతున్నాు.. ప్రతిరోజూ భయంతో బ్రతికే పరిస్థితి నెలకొంది.  ఒకదశంలో మనిషికి మనిషి దూరం అవుతారా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచంలో సామాజిక దూరం పాటించడం మొదలు పెట్టారు. ఎవరైనా తుమ్మినా.. దగ్గినా ఆమడ దూరం జరుగుతున్నారు.  చైనాలో పుట్టుకొచ్చిన ఈ మాయదారి వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. ఇక అమెరికా లాంటి అగ్ర రాజ్యంలో దాదాపు 65వేల వరకు మరణాలు సంబవించాయంటే ఈ వైరస్ ఎంత ఘోరంగా విస్తరిస్తుందో అర్థమవుతుంది.  అయితే కరోనా ఇక్కడ అక్కడ అని లేదు.. ఎక్కడ బడితే అక్కడ అన్నట్టు.. చివరికి కరెన్సీ పై కూడా ప్రభావం పడుతుందని అంటున్నారు.

 

 ఒకదశలో ఇప్పుడు రోడ్లపై డబ్బుల కట్టలు కనిపించినా చూసీ చూడనట్టు వెళ్లిపోతున్నారు.  కొన్ని దేశాల్లో కరెన్సీ రోడ్లపై పడ్డా ఎవరూ పట్టించుకోని దుస్థితి నెలకొంది.  భారత దేశంలో ఈ మద్య కరెన్సీలో రోడ్లపై వేయడం.. ఇండ్ల మద్య వెదజల్లడం చేస్తున్నారు. అయితే వాటికి కరోనా వైరస్ ఉందన్న భయంతో ఎవరూ వాటిని ముట్టుకోవడం లేదు. తాజాగా మాంబళం మాణిక్కం వీధిలో అర్ధరాత్రి సైకిలుపై వచ్చిన ఇద్దరు యువకులు ప్రతి ఇంటి ఎదుట రూ.20, రూ.50 నోట్లను విసిరి వేస్తూ వేగంగా వెళ్లిపోయారు. నోట్లను విసిరే ముందు ఆ యువకులు సైకిలు బెల్‌ మోగించారు.  ప్రజలు తలుపులు తెరచి వీధికేసి చూడగా గడప ముందు  కొత్త రూ.20, రూ.50 నోట్లు పడి ఉండడం గమనించారు.

 

సాధారణ పరిస్థితుల్లో అయితే ఆ నోట్లనూ ప్రతి ఒక్కరూ పోటీపడి ఏరుకునేవారు.  ఈలోగా కొందరు వీధిలో తిరుగుతూ రోడ్డుపై పడి ఉన్న నోట్లను తాకితే కరోనా వైరస్‌ సోకుతుందని, వాటిని తాకవద్దంటూ హెచ్చరికలు చేశారు. పోలీసులకు సమాచారం అందింది. హుటాహుటిన మాణిక్కం వీధికి చేరుకుని కరెన్సీ నోట్లను ప్లాస్టిక్‌ సంచిలో వేసుకున్నారు.  ఇక ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన వీడియో దృశ్యాల ఆధారంగా నోట్లు చల్లిన యువకుల ఆచూకీని గుర్తించేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: