ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ మౌనం వెనుక అర్థం ఏంటి? లాక్ డౌేన్‌ మరో రెండు వారాలు పొడిగిస్తూ హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చాక ప్రధాని వెూడీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని ప్రచారం జరిగిన‌ప్ప‌టికీ...ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న ప్ర‌సంగించ‌లేదు. దీంతో మోదీజీ మౌనంపై దేశం త‌న విశ్లేష‌ణ‌లు తాను చేసుకుంటోంది. అదే స‌మ‌యంలో టెన్ష‌న్ సైతం క‌లుగుతోంది.

 

గ‌త నెలాఖరున అమల్లోకి తెచ్చిన లాకడౌేన్‌ గడువు ముగిసే తరుణంలో ప్రధాని నరేంద్ర వెూదీ జాతినుద్దేశించి ప్రసంగించి దాన్ని వచ్చే నెల 3 వరకూ పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. ఈ క్లిష్ట సమయంలో దేశ ప్రజానీకమంతా పాటించాల్సిన ఏడు అంశాలను కూడా ఆయన ప్రస్తా వించారు. కరోనా మహమ్మారి తీవ్రత ఆశించిన స్థాయిలో తగ్గిన దాఖలా లేకపోవడంతో లాక్ డౌన్‌ పొడిగింపే ఉత్తమమని ప్రకటించారు. దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ప్రధానితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఇదే అభిప్రాయం వెల్లడించారు. అదే సమయంలో వ్యవసాయం, ఆక్వా, ఉద్యానపెంటల దిగుబడుల రవాణా, వాటి మార్కెటింగ్‌, పారిశ్రామికరంగం తదితరాలను కూడా దృష్టిలో పెట్టు కోవాలని సూచించారు. చాలా దేశాలతో పోలిస్తే మన దేశంలో లాకడౌేన్‌ అమలు తీరు ఎంతో మెరుగ్గా ఉందని ప్రధాని వెూదీ చెప్పిన మాటల్లో వాస్తవముంది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా ఆశించినంతగా తగ్గటం లేదు. దీన్ని కట్టడి చేయడం సామాన్యమైన విషయం కాదని, ఇప్పటికిపðడు ఇది కంట్రోల్‌ కాదని అంటున్నారు. పాజిటివ్‌ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఆందోళనకర స్థాయికి చేరుతోందని గణాంకాలు గమనిస్తే తెలుస్తుంది. లాక్ డౌన్‌తో ఉపాధి కోల్పోయినవారి కోసం చర్యలు తీసుకుంటున్నా అవి ఎక్కడా సరిపోవడం లేదు.

 

దశాబ్దాలుగా అసంఘటిత రంగ కార్మికుల స్థితిగతులెలా వున్నాయో, వారిలో ఎందరూ నవెూదవుతున్నారో లేదో ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల హఠాత్తుగా వచ్చిపడిన ఈ సంక్షోభంలో అందరికీ సాయం అందించడం సమస్యగా మారింది.  ప్రజలంతా ఇప్పటివరకు ప్రభుత్వాలు చెప్పినట్లుగా లాకడౌేన్‌ పాటిస్తూ ఇంటికి పరిమితం అయ్యారు. జన్‌ధన్‌ ఖాతాలు లేకున్నా, ప్రభుత్వాలు సాయం చేయకున్నా బిక్కుబిక్కుమంటూ మధ్య తరగతి, ఇతర తరగతుల వారు భవిష్యత్‌పై బెంగతో కూర్చున్నారు. తమకు ఎలాంటి సాయం అందుతుందో అన్న ఆశతో ఉన్నారు. ఈ తరతగతులకు ఎలాంటి ఊరడింపు వస్తుందో అని ఎదురుచూశారు. ఈ నేప‌థ్యంలో ప్రధాని ఎలాంటి సందేశం ఇస్తార‌ని ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అంద‌రి చూపు మోదీజీపైనే ప‌డింది.

మరింత సమాచారం తెలుసుకోండి: