నిన్నటి నుంచి భారతదేశంలో లాక్ డౌన్ 3.0 మొదలవగా కేంద్ర ప్రభుత్వం దేశంలో కొన్ని ప్రాంతాలకు సడలింపు ఇచ్చింది. అయితే ఇందులో భాగంగానే మద్యం దుకాణాలు తెరుచుకొనేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. ఒక తెలంగాణ రాష్ట్రం తప్పించి చాలా రాష్ట్రాల్లో మందు షాపులు తెరుచుకున్నాయని అని చెప్పవచ్చు. ఇక అంతే గత 45 రోజులుగా మందు లేక తెగ ఇబ్బందులు పడిపోతున్న మందుబాబులకు పండగ లాంటి వార్తను కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో ఏకంగా మొదటి రోజే మందుబాబులు లిక్కర్ షాపులపై ఎగబడ్డారు. సామాజిక దూరం మాట పక్కన పెడితే వైరస్ బారిన పడతారని ఏమాత్రం భయం లేకుండా మందు దొరికింది అన్న ఆనందంతో చాలాచోట్ల డ్యాన్సులు, పూజలు చేశారు మందుబాబులు.

 


ఇక ఇది ఇలా ఉంటే కర్ణాటకలోని బెంగళూరు సిటీలో ఒక వ్యక్తి దాదాపుగా 50 వేల రూపాయల మద్యం కొనుగోలు చేశాడు. ఇదే ఎక్కువ అనుకుంటే బెంగళూరు లోనే మరో వ్యక్తి లక్ష కంటే ఎక్కువ విలువ చేసే మద్యం బాటిళ్లను కొనుగోలు చేశాడు. అయితే దీనికి సంబంధించిన బిల్ పేపరు ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అయితే అతను వివిధ బ్రాండ్లకు సంబంధించి మందు బాటిల్లను కొనుగోలు చేశాడు. అయితే ఇందుకుగాను మిశ్రమ కామెంట్లు వస్తున్నాయి.

 


దేశంలో చాలామంది లాక్ డౌన్ కావడంతో నిరాశ్రయులు అవ్వగా... కనీసం రోజులో ఒక్క పూట కూడా భోజనం లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని కొన్ని కామెంట్లు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో అంత డబ్బును వీటి కోసం వినియోగించడం అవసరమా అని కూడా కొంతమంది కామెంట్ చేశారు. ఈ క్రమంలో ఆ డబ్బులను కొంతవరకు వారి కోసం ఉపయోగించవచ్చు కదా అని చెప్పి కామెంట్లు కూడా చేసిన వారు లేకపోలేదు. అయితే మరి కొందరు అతని మద్దతుగా మందు పై ముందుచూపుతో అతడు కొనింటాడని మరికొందరు కామెంట్లు చేశారు. అంతేకాకుండా వారి డబ్బులు వారి ఇష్టం అంటూ వారి అభిప్రాయాలను తెలిపారు. ఏదిఏమైనా మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మందుబాబులకు పండుగ వాతావరణం ఏర్పడింది. అంతేకాక రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం కూడా వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: