నిజంగా కొంతమందికి అదృష్టం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో  తెలియదు. అంతేకాదు అసలు ఆ అదృష్టాన్ని నమ్మలేరు కూడా. నిజానికి ఇలాంటి పరిస్థితులు అనేకమందికి జరిగాయి అని చెప్పవచ్చు. అదృష్టం ఒక్కోరకంగా ఒకరికి తలుపు తడుతూ ఉంటుంది. కొందరికి లాటరీలో, లేక ఏదైనా ఆస్తి వ్యవహారాల్లో కలిసిరావడం ఇలాంటివి ఎన్నో కారణాలు అనుకోకుండా జరిగే అదృష్టవంతులు అవుతుంటారు. అయితే ఇక అసలు విషయానికి వస్తే....


దుబాయి దేశంలో మరో భారతీయుడికి జాక్ పాట్ తగిలింది. ఒక ప్రైవేట్ కంపెనీలో సేల్స్ మాన్ గా పనిచేసే వ్యక్తికి లాటరీ తగిలింది. ఇక అంతే రాత్రికి రాత్రి తను కోటీశ్వరుడు అయిపోయాడు. అది ఎంత అంటే 10 మిలియన్ దిర్హమ్స్‌. అంటే మనకు భారత కరెన్సీ ప్రకారం సుమారు 20 కోట్లు లాటరీ తగిలింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే...  సదరు వ్యక్తి పేరు ఎల్లికొట్టల్‌ పరమేశ్వరన్. ఈయన కేరళ రాష్ట్రంలోని త్రిశ్శూర్‌ కి చెందిన వ్యక్తి. ఆయన గత 17 సంవత్సరాల నుంచి యూఏఈ లోని ఆజ్మీన్ నగరంలో నివసిస్తున్నాడు. అయితే అదే నగరంలో ఒక ఆటోమొబైల్ సంస్థలో సేల్స్ మెన్ గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.

 

అయితే ఇక ప్రతి నెల మూడో తారీఖున అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించే లాటరీలో 500 దిర్హమ్స్‌ అంటే దాదాపు పది వేలు పెట్టి ఇటీవల ఆయన ఒక లాటరీ టికెట్ కొన్నాడు. ఇక అంతే అదృష్టం అతన్ని వరించింది.  అలాగే ఆ లాటరీ డ్రా లో అతడు కొన్న లాటరీకి ఏకంగా 20 కోట్లు గెలుచుకున్నాడు. ఈ విషయాన్ని అక్కడ స్థానిక వార్త సంస్థ తెలిపింది. అయితే ఆ మొత్తంలో కొంత సొమ్ముని బ్యాంకుల్లో తీసుకున్న రుణం తీర్చగా మిగిలిన సొమ్మును తన ఇద్దరు పిల్లల చదువుకు వాడతానని దిలీప్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: