ఈ మధ్యకాలంలో అశ్లీల వీడియోలు విద్యార్థులపై ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. పాఠశాల వయస్సు నుంచే స్మార్ట్ఫోన్ వాడుతుండటం ఇక అశ్లీల వీడియో లకు ఎక్కువగా బానిసలు అవుతుండటం కారణంగా రోజురోజుకు విద్యార్థుల ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది. ఇక ఈ అశ్లీల వీడియోలు వేరొకరికి పోస్ట్ చేయడం లేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లాంటివి చెయ్యడం ద్వారా చిక్కుల్లో పడిపోతున్నారు విద్యార్థులు. తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో అశ్లీల ఫోటోలు షేర్ చేసిన ఓ విద్యార్థిని ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందుకే ఇది ఇక్కడితో ఆగలేదు సదరు విద్యార్థి ఇచ్చిన సమాచారంతో ఇంకా కొంతమంది ఆకతాయిలు గుర్తించే పనిలో పడ్డారు సైబర్ క్రైమ్ పోలీసులు. 

 

 

 బాయ్స్ లాకర్ రూమ్ పేరిట కొంతమంది యువకులు ఇంస్టాగ్రామ్ లో అకౌంట్ క్రియేట్ చేసి అమ్మాయిలపై ఆకృత్యాలకు పాల్పదాలంటూ  అంటూ ఇతరులను రెచ్చగొట్టిన విషయం తెలిసిందే. అంతేకాకుండా తమ తోటి విద్యార్థుల ఫోటోలు మార్ప్  చేసి వారి గురించిన అశ్లీల సంభాషణకు తెరలేపారు విద్యార్థులు. ఈ విషయాన్ని అదే స్కూల్ కు చెందిన ఓ బాలిక గ్రహించి సోషల్ మీడియా  వేదికగా అసలు బాగోతాన్ని బహిర్గతం చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున స్పందించిన నెటిజన్లు  ఆ విద్యార్థుల పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. 

 

 

 ఈ క్రమంలోనే #boyslockerroom అనే హ్యాష్ టాగ్  కాస్త ట్రెండింగ్  గా మారిపోయింది. ఇక ఈ విషయాన్ని ఆ యువకులు వెంటనే తెలుసుకున్నారు. తాము చేస్తున్న తప్పుడు పని ని బహిర్గతం చేసిన ఆ యువతి గురించి తెలుసుకొని ఆమెకు సంబంధించిన చిత్రాలను మార్ఫ్  చేసి వైరల్ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఈ క్రమంలోనే బాయ్స్ లాకర్ రూమ్ చాట్ గ్రూపులో ఉన్న స్కూల్ విద్యార్థిగా పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించగా మరికొంతమంది పేర్లు  బయటకు వచ్చాయి. ఢిల్లీలోని ఓ ప్రముఖ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని అదుపులోకి తీసుకున్నామని.. అతని చరవాణిని  కూడా సీజ్ చేసినట్లు వెల్లడించారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: