ప్రముఖ నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ పై విమర్శలు చేశారు. ఈ మధ్య నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా చేస్తున్న కామెంట్ల వల్ల లోకేష్ ను ఇష్టపడే ఎంతో మంది బాధ పడుతున్నారని పేర్కొన్నారు. లోకేష్ ప్రవర్తనను చూసి చంద్రబాబు గర్వంగా నిద్రపోయే రోజు రావాలని కోరుకుంటున్నానని అన్నారు. రాజకీయ పార్టీ అంటే సాఫ్ట్ వేర్ కంపెనీ కాదని... పార్టీలో ఉండే నాయకులు ఉద్యోగులు కారని అన్నారు. 
 
నారా లోకేష్ ప్రతి ఒక్కరినీ ప్రేమించి ప్రేమను పంచి మనలో ఒకరిగా చూసుకుని ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు. ప్రపంచంలో అతి కొద్ది మందికి మాత్రమే దక్కే అదృష్టం లోకేష్ కు దక్కిందని... చంద్రబాబు నాయుడు కుమారుడిగా పుట్టడం నిజంగా లోకేష్ అదృష్టమని అన్నారు. రాజకీయాల్లో వారసత్వం కంటే ప్రజలకు విశ్వాసం కల్పించడం ముఖ్యమని లోకేష్ కు సూచించారు. 
 
రాజకీయ నాయకులు దమ్ము, ధైర్యంతో పాటు ప్రజలతో పోరాడతాడనే లక్షణాన్ని కలిగి ఉండాలని చెప్పారు. రాజకీయాలంటే తనకు చాలా ఇష్టమని... కానీ రాజకీయాలు చాలా కష్టమని భావించి వదిలేశానని చెప్పుకొచ్చారు. నారా లోకేష్ కేసీఆర్ కుమారుడు కేటీఆర్ లా ఉండాలని... తొమ్మిది సంవత్సరాలపాటు సుదీర్ఘంగా పోరాడి ఘన విజయం సాధించిన జగన్ లా ఉండాలని.... తండ్రికి పోటీ ఇచ్చే విధంగా నారా లోకేష్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. 

 
నారా లోకేష్ రాజకీయాల్లో పట్టు సాధించలేరేమో అని తనకు భయం వేస్తోందని.... రాజకీయాల్లో లోకేష్ నంబర్ వన్ కావాలని కోరుకుంటున్నానని చెప్పారు. మొన్నీ మధ్య టీటీడీ ఛైర్మన్ స్వామి వారి దర్శనం చేసుకొని వచ్చిన సమయంలో చేసిన ట్వీట్ లోకేష్ దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకపోయినా చంద్రబాబుపై ఉన్న గౌరవంతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని పేర్కొన్నారు. చంద్రబాబు కుమారుడిగా తప్ప లోకేష్ కు ఏ అర్హత లేదని.. లోకేష్ ఫెయిల్యూర్ నాయకుడు అని పేర్కొంటూ బండ్ల గణేష్ ట్వీట్లు చేశారు. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: