కుక్క ఎంతో విశ్వాసంగా ఉంటుంది అంటూ ఉంటారు... అయితే ఇప్పటి కుక్కలు కేవలం విశ్వాసంగా ఉండటం మాత్రమే కాదు ఎన్నో సాహసాలు కూడా చేస్తున్నాయి.... ప్రాణాలకు తెగించి ఇతర జీవుల ప్రాణాలను కూడా కాపాడుతున్నాయి . కుక్కల్లో  విశ్వాసమే కాదు మానవత్వం కూడా ఉంటుంది అని నిరూపించుకుంటున్నారు. తాజాగా ఓ కుక్క చేసిన సాహసం చూస్తే మీ నోటి నుంచి కూడా ఇలాంటి మాటలు రాక మానవు. ఇక్కడున్నా కుక్క మామూలు కుక్క కాదు ఏకంగా వంద జంతువుల ప్రాణాలను కాపాడిన వీర శునకం. ప్రాణాలకు తెగించి మరీ జంతువుల ప్రాణాలను కాపాడింది ఇక్కడ ఈ కుక్క

 

 

 అదెలాగో తెలియాలంటే వివరాల్లోకి వెళ్ళాల్సిన మరి... గత ఏడాది ఆస్ట్రేలియా అడవుల్లో కార్చిచ్చు అంటుకొని ఎంతగానో వినాశనం సృష్టించినదో  విషయం తెలిసిందే.... అప్పటి నుంచి నేటి వరకూ మంటల్లో చిక్కుకున్న వందకు పైగా కోలాలను ఈ కుక్క ఏకంగా ప్రాణాలకు తెగించి మరీ కాపాడి శభాష్ అనిపించుకుంది, ఈ వీర శునకానికి  మొదట ఒబేసివ్  కంపల్సివ్ అనే వ్యాధి ఉండేది. దీంతో ఈ కుక్కను  ఆడుకోవడానికి కూడా బయటకు పంపించేవారు కాదు... కానీ తర్వాత ఓ యూనివర్సిటీ వారు ఈ కుక్కను అక్కున చేర్చుకుని ఇతరులను ఎలా కాపాడాలి అనే విషయంలో శిక్షణ ఇచ్చారు. 

 

 

  ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాలో కార్చిచ్చు అంటుకున్న సమయంలో ఈ వీర శునకం సేవలను వినియోగించుకోనున్నారు అక్కడి అధికారులు. డ్రోన్ కెమెరాల ద్వారా చెట్టు పుట్ట లో దాగి ఉన్న కోలాలను గుర్తించి... వాటిని సంరక్షించేందుకు ఈ కుక్కను పంపించేవారు.మంటలు చుట్టుముడుతున్న ఏ మాత్రం భయపడకుండా... ప్రాణాలకు తెగించి మరీ మంటల్లో పరుగులు పెడుతూ కోలాలను కాపాడింది ఈ శునకం . ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. దీంతో నెటిజనులు ఈ కుక్క పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా  ఆస్ట్రేలియా అడవుల్లో అంటుకున్న బుష్ ఫైర్  ఎంత నష్టాన్ని కలిగించిందో  అందరికీ తెలిసిన విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: