తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పొలిటికల్ కెరియర్ చాలా గందరగోళంగా నడుస్తుంది. మొదటి నుండి పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు సరైన సపోర్ట్ ఇవ్వకపోవడం తో పాటు అధిష్టానం కూడా పూర్తిస్థాయిలో స్వేచ్ఛ రేవంత్ రెడ్డికి పోవటంతో ఆయన లో అసంతృప్తి సెగలు బయట పడుతున్నట్లు తెలంగాణ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. జైలుకు వెళ్లక ముందు వరకు బాగా హడావిడి చేసిన రేవంత్ రెడ్డి...తాజాగా మాత్రం చాలా సైలెంట్ అయిపోయారు. దీనికి కారణం చూస్తే సొంత పార్టీ నాయకులు అని తెలంగాణ రాజకీయాల్లో వినబడుతున్న టాక్.

 

తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత రేవంత్ రెడ్డి ఎప్పటిలాగానే టిఆర్ఎస్ పార్టీ పై కేటీఆర్ పై మరియు ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ చాలా యాక్టివ్ గా రాణించారు. కాంగ్రెస్ లాంటి బలమైన పార్టీ తనకు అండగా ఉంటే ఇంకా బాగా పోరాటం చేయవచ్చు అని భావించిన రేవంత్ తీరా పార్టీలో చేరిన తర్వాత ఆయనకు సరైన సపోర్ట్ రాకుండా పోయింది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువ అవటంతో సీనియర్లు అధిష్ఠానానికి రాష్ట్రానికి మధ్య అడ్డుగా ఐరన్ లెగ్ ల మాదిరిగా వ్యవహరించడం రేవంత్ కి విసుగు తెప్పించి నట్లయింది.

 

దీంతో సొంత పార్టీ నేతలే తనని వెన్నుపోటు పొడిచే విధంగా వ్యవహరిస్తున్న తరుణంలో పార్టీ కోసం దూకుడుగా వ్యవహరించడం వ్యర్థమని అనుకుంటున్నారట. ఏకంగా కేసీఆర్.... కేటీఆర్ పై పోరాటానికి దిగిన గాని తనకి పార్టీ నుండి సరైన సపోర్ట్ లేకపోవడంతో ఇకనుండి చూసీచూడనట్టు వ్యవహరించాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా వి.హనుమంతరావు, జగ్గారెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు తనను బాగా టార్గెట్ చేసుకున్నారని రేవంత్ నమ్ముతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: