గత కొన్ని రోజులుగా ఏపిలో పంచాయతీ కార్యాలయాలన్నింటికి వైసీపీ జెండా రంగులు వేశారని ఆరోపణలు వినిపించాయి.  అయితే ఈ విషయంలో కఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాకిచ్చింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత రాష్ట్రంలోని పంచాయతీ కార్యాలయాలన్నింటికి వైసీపీ జెండా మాదిరి రంగులు వేశారు.  వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. పంచాయతీ కార్యాలయాలకు రంగుల విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 623ని హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.  ఈ నేపథ్యంలో ఆ రంగులను తొలగించాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ జీవోపై ఏపీకి చెందిన న్యాయవాది సోమయాజి హైకోర్టులో పిల్ వేశారు.

 

పంచాయతీ కార్యాలయాలకు రంగులకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం కొత్తగా 623 జీవోను విడుదల చేశారంటూ న్యాయవాది సోమయాజి పిల్ దాఖలు చేవారు. పాత జీవోలో ఉన్న అంశాలే ఈ జీవోలో కూడా ఉన్నాయని ఆయన పిల్ లో పేర్కొన్నారు.    పార్టీ రంగులన్నీ అలాగే ఉంచి, కొత్తగా మట్టి రంగును చేరుస్తూ కొత్త జీవో జారీ చేశారని తెలిపారు. దీంతో, కొత్త జీవోను హైకోర్టు నిలిపివేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

 

కాగా, కార్యాలయాలపై పార్టీ రంగులను తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గతంలోనే హైకోర్టు తీర్పును వెలువరించింది. దీంతో, పార్టీకి సంబంధించిన మూడు రంగులకు మరో రంగు (మట్టి రంగు)ను చేర్చుతూ ప్రభుత్వం కొత్త జీవోను ఇటీవల జారీ చేసింది.  ఈ జీవోపై కూడా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యవహారంపై నేడు విచారణ జరిపిన హైకోర్టు కొత్త జీవోను నిలిపివేస్తూ, తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో 19న  ఏ తీర్పు ఎలా ఉండబోతుందో

మరింత సమాచారం తెలుసుకోండి: