పటిష్ట వైద్య సేవలతో కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎంత చేసినా ఫలితాం మాత్రం అడ్డం తిరుగుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య‌శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ అందరిని మరోసారి భయాందోళనకు గురి చేసింది. ఇప్పటి వరకు దేశ‌వ్యాప్తంగా 46,433 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లోనే 2,900 కొత్త కేసులను గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో భిన్నంగా కేసులు నమోదు అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా తెలంగాణలో అతి తక్కువ కేసులు వస్తుండగా.. ఏపీలో మాత్రం పాజిటివ్ ఉన్న వారి సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కేవలం 3 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి.

 

 

దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1085కి చేరింది.  లాక్‌డౌన్ 3.0 అమలులోకి వచ్చినా ఈ స్థాయిలో కేసులు రావడం విశేషం. కేంద్రం తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం  ఈ మహమ్మారి బారినపడి 1,568 మంది మరణించగా.. 12,727 మంది కోలుకున్నారు. ఇటీవల మరో 40 మంది డిశ్చార్జి కావడంతో కోలుకున్న వారి సంఖ్య 585 చేరడంతో 471 మంది గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడి 29 మంది మరణించారు.  దీంతో ప్రస్తుతం 32,138 యాక్టివ్ కేసులు ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేసింది.

 

 

మ‌హారాష్ట్ర‌లో అత్య‌ధికంగా 14,541 కేసులు ఉండగా.. గుజ‌రాత్‌లో 5,804,ఢిల్లీలో 4, 898కు చేరింది.  ఆంధ్రప్రదేశ్‌ను మాత్రం కరోనా వదలడం లేదు. పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో  ప్ర‌జ‌లు, అధికార యంత్రాంగం వణికిపోతోంది. నిన్న ఒక్క రోజే 67 మందికి కొత్తగా వైరస్ లక్షణాలు గుర్తించారు. రాష్ట్రంలో 1650 మందికి వైరస్ అంటుకుంది. 33 మంది మరణించారు. ఇంకా 1093 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: