చంద్రబాబు హైదరాబాద్ వాసిగానే ముద్ర పడ్డారు. మొదటి నుంచి చంద్రబాబుకు హైదరాబాద్ అంటే ఇష్టం. ఆయన ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నపుడు కూడా హైదరాబాద్ అభివ్రుధ్ధి మీదనే  ఎక్కువ ద్రుష్టి పెట్టేవారు. ఐటీ హబ్ గా హైదరాబాద్ ని చేశారు. సైబరాబాద్ ని కూడా బాబు డిజైన్ చేశారు. బాబుకు ఎందుకో కానీ హైదరాబాద్ మీద ప్రత్యేకమైన అభిమానం.

 

సరే అవన్నీ పక్కన పెడితే చంద్రబాబు నాలుగేళ్ళ పాటు సీఎం గా అమ్రావతి నుంచే పాలన సాగించారు. అప్పట్లో ఆయన నోటి వెంట అమరావతి ఎక్కువగా వినిపించేది. ఇక బాబు గత ఏడాది ఓడిన తరువాత హైదరాబాద్ కి తరచూ వెళ్తున్నారు. అదెలా అంటే ఆయన వీకెండ్ డేస్. ఇక పండుగలు, ముఖ్య కార్యక్రమాలకు హైదారాబాద్ నే వేదిక చేసుకున్నారు. అది తప్పేం కాదు కూడా.

 

బాబుకు హైదరాబాద్ లో భారీ భవంతి ఉంది. అక్కడే ఆయన వ్యాపారాలూ, కుటుంబం అంతా ఉన్నారు. అందువల్ల బాబు అక్కడే సెటిల్ కావాలంతే వందల కోట్లతో భారీ భవనం నిర్మించుకున్నారు. ఇక మార్చిలో జనతా కర్ఫ్యూకి ముందు హైదరాబాద్ వెళ్ళిన చంద్రబాబు ఇప్పటికీ అక్కడే ఉంటున్నారు.

 

ఆయన అమరావతి ఎపుడు వస్తారన్నది ఆసక్తికరమైన చర్చగా ఉంది.  ఏపీకి వస్తే బాబుని కూడా హోమ్  క్వారంటైన్ లో పెడతాము అని వైసీపీ నేతలు అంటున్నారు. మరో వైపు ఆయన హైదరాబాద్ లో పరదేశిలా ఉన్నారని విమర్శలు చేస్తున్నారు. దాంతో బాబు అమరావతి రావాలని, ఎలాగైనా ఆయన ఇక్కడకు చేరుకుంటే తమ్ముళ్లకు మంచి బూస్టప్ గా ఉంటుందని అంటున్నారు.

 

అయితే బాబు మాత్రం ఇప్పట్లో అమరావతికి వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు . వచ్చి చేసేది కూడా ఏమీ లేదని, అక్కడైనా, ఇక్కడైనా ఇంట్లోనే ఉండాలని, కాబట్టి హైదరాబాద్ లోనే కుటుంబం మధ్యన ఉంటే బాగుంటుందని బాబు ఆలోచిస్తున్నారని అంటున్నారు.  మొత్తానికి కరోనా మహమ్మారి కట్టడి అయిన తరువాతనే బాబు అమరావతి వైపు వస్తారనుకోవాలేమో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: