కరోనా వైరస్ కారణంగా తెలుగు రాష్ట్రాలలో అన్ని రంగాలు మూతపడ్డాయి. దీనితో వలస కార్మికులు అంతా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలలో లక్షల మంది వలస కూలీలు జీవనం కొనసాగిస్తున్నారు. వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాలలో ఉండే ప్రభుత్వ సహాయం అందుకుంటున్నారు. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు అంతా కూడా ఒక కారణంగా ఎక్కడి వారు అక్కడే చిక్కుకు పోవడం జరిగింది. అలాగే వలస కార్మికులు అంతా కూడా వాళ్ల సొంత రాష్ట్రాలకు పంపించాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.

 


దీనితో ఇక వీరి కోసం తెలంగాణ పోలీసులు ఒక ప్రత్యేక యాప్ ను రూపొందించారు. ఇక వారంతా వాళ్ళ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు  పోలీస్ స్టేషన్ కు వచ్చి వాళ్ళ వివరాలు నమోదు చేస్తున్నారు. అంతేకాకుండా వలస కార్మికుల అందర్నీ కూడా పోలీసులు 1200 మందిని ఒక బ్యాచ్ చేసే పనిలో ఉన్నారు. అలాగే వలస కార్మికుల అందర్నీ వాళ్ళ సొంత ఊర్లకు పంపుతామని తెలియజేశారు. ఇక అంతే కాకుండా ఎవరూ కూడా నేరుగా రైల్వేస్టేషన్, బస్ స్టేషన్ కి వెళ్లొద్దు... మీ ప్రయాణం తేదీ, ఎక్కడికి రావాలి అని పూర్తి వివరాలు మేము తెలియ చేస్తామంటూ పోలీసులు తెలియ చేస్తున్నారు. ఇక ఈ తరుణంలోనే ఇటీవల సైబరాబాద్ పరిధిలో పోలీస్ స్టేషన్ లో వలస కార్మికులు అంతా కూడా వారి వివరాలు యాప్ లో నమోదు చేసుకున్నారు. 

 

ఇకపోతే, ఇదంతా ఇలా ఉండగా మరోవైపు ఆంధ్రాలో వలస కార్మికులు అందరూ ఆందోళన చేపట్టారు. మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ లో భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు. పెండింగ్ లో ఉన్న బకాయిల ను తమకు చెల్లించాలని అలాగే మా సొంత ఊర్లకు పంపించాలి అంటూ వలస కార్మికులు డిమాండ్ చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: