ప్రస్తుతం భారత దేశాన్ని రోజురోజుకు కరోనా  వైరస్ కబళిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత దేశ వ్యాప్తంగా పెద్ద మొత్తంలో కంట్రోలింగ్  మెకానిజం లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చే సరికి అద్భుతమైన టెస్టింగ్ చేస్తోంది. కరోనా వైరస్ నిర్ధారిత టెస్టుల  విషయంలో దేశంలోనే నెంబర్వన్ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది . అయితే కరోనా  వైరస్ నిర్ధారిత టెస్టులు చేయడం వరకు బాగానే ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో కలిపి రెండు చెత్త రికార్డులు ఉన్నాయి అంటున్నారు విశ్లేషకులు. 

 

 దేశంలో మున్సిపాలిటీల పరంగా అతి ఎక్కువగా కరోనా  వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన మున్సిపాలిటీలుగా దేశంలో రెండు  మున్సిపాల్టీలు ముందు వరుసలో ఉన్నాయి. వాటిలో ఒకటి మహారాష్ట్ర లోని  పూనా అయితే... రెండవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నరసరావుపేట మున్సిపాలిటీ. ఇది ఒక చెత్త రికార్డు అనే చెప్పాలి. దేశంలోనే ఎక్కువ కరోనా  కేసులు నమోదైన మున్సిపాలిటీగా నరసరావుపేట రికార్డు లో ఉంది. అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి నగరాలలో ఎక్కువగా కరోనా  వైరస్ కేసులు నమోదైన నగరాలలో కర్నూలు కూడా ఒక నగరంగా ఉంది. ఇది కూడా మరొక చెత్త  రికార్డు గా చెప్పుకోవచ్చు.

 


 తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కూడా ఇలా వైరస్ కేసుల్లో  ఎక్కువగా ఉన్న నగరాల జాబితాలో ఉంది. అయితే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం యొక్క రాజధాని కాబట్టి అక్కడ ఏకంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారు కోటి మందికి పైగా  జనాభా ఉన్నారు. కానీ కర్నూలు నగరంలో మాత్రం తిప్పికొడుతే  10 లక్షల మంది జనాభా కూడా లేరు కానీ హైదరాబాద్ సరసన చేరింది కర్నూలు నగరం. అంటే రెండు చెత్త  రికార్డులు అని చెప్పాలి. ఈ రెండు చెత్త రికార్డులకు  కారణం స్థానిక అధికారిక యంత్రాంగం అని చెప్పాలి. అధికార యంత్రాంగం వైఫల్యం కారణంగానే తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ కర్నూలు నగరాలలో దేశంలోనే ఎక్కువ కేసులు నమోదైన నగరాలలో ఈ రెండు నగరాలు చేరాయి అంటున్నారు విశ్లేషకులు. మరిన్ని వివరాలు ఈ కింది వీడియోలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: