టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... దాదాపు తెలంగాణ తర్వాత ముఖ్యమంత్రి అని కన్ఫర్మ్ అయిపోయింది.. దీనికి ఉన్న అడ్డంకులను తొలగించేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రస్తుతం టీఆర్ఎస్ క్యాడర్ కూడా కేటీఆర్  కాబోయే ముఖ్యమంత్రి అని ఫిక్స్ అయిపోయారు. అటు కేటీఆర్ కూడా తెర మీద కనిపించక పోయినా లోలోపల అటు హరీష్ రావు తో ఇటు కవిత తో ముందుకు సాగుతూనే ఉన్నారు. ఇక ఏ క్షణంలోనైనా మంత్రిగా ఉన్న కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా లేకపోలేదు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు  ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ధైర్యం చెబుతూ కరోనా  వైరస్ గురించి ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ఉంటే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోలోపల పనులన్నీ సైలెంట్గా చేసుకుంటూ పోతున్నారు. 

 

 ముఖ్యంగా కేటీఆర్ తాజాగా తన పనితనాన్ని మరోసారి నిరూపించారు అనే చెప్పాలి. ప్రస్తుతం హైదరాబాద్ వాసులందరికీ మానసపుత్రుడు గా మారిపోయిన కేటీఆర్ తాజాగా మరోసారి సత్తా చాటారు. గత నెల రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్  కొనసాగుతున్న విషయం తెలిసిందే . ఈ నేపథ్యంలో దాదాపుగా ప్రజలందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని రహదారుల్లో  ఏర్పడిన గుంతలు గతుకుల రోడ్లు ను వెంటనే మరమ్మత్తులు  చేసే పనులను చేపట్టారు కేటీఆర్. ఏవైతే పనులు ఎక్కువగా మనుషులు అవసరం లేకుండా మిషనరీ ద్వారా చేయొచ్చో అలాంటి పనులు చేశారు. 

 


 దీంతో నగరంలోని రహదారులన్నీ ప్రస్తుతం సుందరంగా మారినట్లు తెలుస్తోంది. అయితే సిమెంట్ రోడ్లు జోలికి మాత్రం వెళ్లలేదు కేటీఆర్ ఎందుకంటే సిమెంట్ రోడ్లు వేయడానికి ఎక్కువ మంది మనుషులు అవసరం ఉండటంతో పాటు ఎక్కువ రోజులు శ్రమించాల్సి ఉంటుంది. అందుకే సిమెంట్ రోడ్లు జోలికి వెళ్ళలేదు . ఇలా కేటీఆర్ అందరికీ ఆదర్శంగా నిలిచారు అనే చెప్పాలి. ఇదే అంశాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఆదర్శంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు విశ్లేషకులు.  స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకొన్ని రోజుల్లో రానుండగా ఈ సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి... రహదారులను బాగు చేయిస్తే బాగుంటుంది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: