దాయాది ఎపుడూ రగిలిపోతూనే ఉంటుంది. ప్రపంచం మొత్తం తగలబడిపోతున్నా కూడా దాని మండిపాటు తగ్గదు, ఆగదు, ఎపుడూ భారత్ మీద పడి ఏడ్వడమే పాక్ కి తెలుసు. తన ఇల్లు చక్కదిద్దుకోలేక డెబ్బయ్యేళ్ళ విలువైన కాలాన్ని నెట్టేసిన పాక్ కరోనా మహమ్మారికి దేశ ప్రజలకు బలి పెట్టేస్తోంది.

 

పాక్ లో కరోనా కట్టడికి సరైన చర్యలు తీసుకోలేదని వార్తలు వస్తున్నాయి. అక్కడ ఆర్ధికంగా  ఇబ్బందులు ఉన్నాయి. లాక్ డౌన్ విధించకపోతే కరోనా వ్యాపిస్తుంది. ఇపుడు పేదరికానికి తోడు కరోనా మహమ్మరి వీర విహారంతో పాకిస్థాన్ అల్లాడిపోతోంది. ఏకంగా పాక్ ప్రధాని సెల్ఫ్ క్వారంటైన్ వెళ్ళారంటేనే అక్కడ సీన్ అర్ధమవుతోంది.


 
ఇవన్నీ ఇలా ఉన్నా కూడా పాక్ భారత్ మీద తన పగను మరచిపోవడంలేదు. భారత్ ఓ వైపు ఆర్ధికంగా పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. మరో వైపు కరోనా కట్టడికి కూడా తగిన కార్యాచరణను అమలు చేస్తోంది. పైగా ప్రపంచ దేశాలు సైతం భారత్ ని చూసి ప్రస్తుతించడం కూడా పాక్ తట్టుకోలేకపోతోంది.

 


దాంతో పాక్ భారత్ ని దెబ్బతీయాలనుకుంటోంది. అందుకే ఉగ్రవాదాన్ని మళ్ళీ నమ్ముకుంది. ఆదివారం దొంగ దెబ్బ తీసి అయిదుగురు భారత్ వీర సైనికులను పొట్టన పెట్టుకున్న పాక్ ఇపుడు మరిన మందిమీద పంజా విసరాలనుకుంటోంది. పాక్ జైళ్ళ నుంచి చాలా మంది ఉగ్రవాదులను కరోనా కారణం చెప్పి విడుదల చేస్తోంది.

 

వారిని చాలా తెలివిగా భరత్ సరిహద్దులకు చేరుస్తోందని అంటున్నారు. భారత్ ఇపుడు కరోనా మహమ్మారిని కట్టడి చేసే పనిలో ఉంది. ఇదే అదనుగా భారత్ మీద దాడి చేసి తన ప్రతీకారాన్ని తీర్చుకోవలనుకుంటోంది. మరి భారత్ కూడా పాక్ దుర్మార్గాన్ని గమనించి తగిన బుధ్ధి చెప్పేందుకు రెడీ అవుతోంది.

 

తన దేశంలో ప్రజలకు కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోలేని పాక్ ఆ వైఫల్యాల నుంచి తప్పించుకోవడానికే భారత్ మీద కయ్యానికి కాలు దువ్వుతోందని అంటున్నారు. మరి పాక్ జిత్తులమారి వేషాలను ఎదుర్కోవడానికి భారత్ కూడా రెడీగానే ఉంది. పాపిష్టి పాక్ కి బుద్ది చెప్పేందుకు భారత్ జవాన్లు అన్ని రకాలుగా సన్నధ్ధంగానే  ఉన్నారు. మరోసారి దెబ్బ తిని మూల కూర్చోవడానికే పాక్ ఇలా చేస్తోందని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: