టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాలలో కుల రాజకీయాలు చేయాలంటే అయిన తర్వాత అని చాలా మంది ప్రత్యర్థులు సీనియర్ రాజకీయ నేతలు అంటుంటారు. దళితులను విడదీసి వారిని ఓటు బ్యాంకు గా చూసి దారుణమైన రాజకీయాలు చంద్రబాబు చేశారని ఎప్పటినుండో వింటూనే ఉన్నాం. చాలా వరకూ కుల ప్రాతిపదిక పైన చంద్రబాబు పొలిటికల్ లెక్కలు ఉంటాయని అంటుంటారు. అటువంటి చంద్రబాబు కి కులం పేరుతో చేసే రాజకీయాలకు జగన్ తన బంపర్ స్కెచ్ తో చెక్ పెట్టడానికి రెడీ అయ్యారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఎప్పటినుండో ఉంటున్న తరుణంలో జగన్ దాన్ని టార్గెట్ గా చేసినట్లు ఏపీ రాజకీయాల్లో టాక్.

 

40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కి దిమ్మ తిరిగిపోయే విధంగా పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ ఓటు బ్యాంకు మొత్తం వేరు లతో సహా కదిలించడానికి జగన్ రెడీ అయ్యారు. ముఖ్యంగా ఈ జిల్లాలో టీడీపీకి కమ్మ సామాజిక వర్గం మరియు బిసి వర్గం ఓటు ఎక్కువగా ఉండటంతో ఆ వర్గాలలో ఉన్న నాయకులను ఆకర్షించే కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఏలూరు ఎంపీ కోటగిరి విద్యాధరరావు నీ రంగంలోకి దింపి క‌మ్మల‌కు ప్రాధాన్యం పెంచే కార్యక్రమం స్టార్ట్ చేశారు.

 

ఇదే సమయంలో అబ్బాయి చౌదరి... చింత‌పూడి, గోపాల‌పురం, దెందులూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో టిడిపికి అండగా ఉన్న కమ్మ సామాజిక నాయకులను ఇప్పటికే వైసీపీ పార్టీలో చేర్పించడానికి మొత్తం రంగం సిద్ధం చేశారు. అంతేకాకుండా కోనసీమలో అత్యంత కీలకమైన క్షత్రియ, బీసీ వర్గాలకు చెందిన నాయకులను వైసీపీ పార్టీలో చేర్పించడానికి వారికి ప్రాధాన్యతనిస్తున్నారు అట. దీంతో దాదాపు పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీకి వెన్నెముక గా ఉన్న సామాజిక వర్గాలు మొత్తం తాజా పరిస్థితులు బట్టి వైసీపీకి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.   

మరింత సమాచారం తెలుసుకోండి: