లాక్‌డౌన్ వల్ల ప్రజలంతా ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో గర్భిణీల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. దాంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గర్భిణీల విషయంలో అప్రమత్తం అయ్యాయి. గర్భిణీల విషయంలో తీసుకుంటున్న ప్రత్యేక చర్యలేంటో తెలుసా.. 

 

కరోనా వైరస్ కారణంగా తీసుకున్న చర్య వల్ల.. సాధారణ జనజీవనానికి ఎన్నోఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిత్యవసర సరుకులు మొదలుకొనని ప్రజల ఆరోగ్యం వరకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలపై ప్రత్యేక దృష్టి సారించింది. కరోనా కేసులు పెరుగుతున్ననేపథ్యంలో.. ప్రసవాల విషయంలో ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసుల నేపథ్యంలో గర్భిణీలు, డెలీవరి సమయంలో అప్రమత్తంగా ఉండాలని  కేంద్రం సూచించింది.

 

ప్రతినెల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 వేల ప్రసవాలు జరుగుతాయి. ప్రస్తుతం లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో మే నెలలో జరిగే ప్రసవాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోనుంది ప్రభుత్వం. ముఖ్యంగా రెడ్ జోన్లతో పాటూ కరోనా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో డెలివరికి ఉన్న వారి లెక్కలు, వివరాలు సేకరిస్తున్నారు.. ఇప్పటికే ఆ పనుల్లో నిమగ్నమయ్యారు అధికారులు.

 

కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న ఏరియాలు.. ముఖ్యంగా రెడ్ జోన్ ప్రాంతాల్లో ఉన్న గర్భిణీలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అలాగే ఎక్కువగా వలస కార్మికులు, జన సమూహం ఉన్న ప్రాంతాల్లో ఉండే వాళ్లకు.. డెలివరీ డేట్ కు ముందే కరోనా పరీక్షలు చేయనున్నారు.

 

గర్భిణీలకు డెలివరీ జరగడానికి 5 రోజుల ముందే కోవిడ్-19 టెస్టులు చేయనున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి, సూర్యాపేట, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో  డెలివరీ డేట్ దగ్గర పడ్డ వాళ్ళ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాల్లోని ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: