జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు ఓ రేంజ్ లో విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని చంద్రబాబు వ్యతిరేకించారు. అలాగే ప్రతి పథకంపై విమర్శలు చేసారు. అంటే జగన్ ఏం చేసినా బాబుకు నచ్చలేదు. ఇక ప్రస్తుతం కూడా కరోనా పై పోరాడుతున్న సరే , కరోనా కట్టడి చేయడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని బాబు మాట్లాడుతున్నారు.

 

ఇదే క్రమంలోనే తాజాగా మద్యం షాపులు ఓపెన్ చేయడంపై కూడా బాబు మండిపడుతున్నారు. కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం పడిపోతున్న నేపథ్యంలో, కేంద్రం ఆదేశాల మేరకు జగన్ షాపులు ఓపెన్ చేయించిన బాబు మాత్రం ఓ ఫైర్ అయిపోతున్నారు. నిత్యావసరాల కోసం 3 గంటల సమయం ఇచ్చిన ప్రభుత్వం.. మద్యం కోసం 8 గంటల సమయం ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్‌వి కుర్ర చేష్టలని, క్వారంటైన్ సెంటర్ల వద్ద టెస్టులు చేశారా? ధరలు పెంచడం వల్ల మద్యపాన నిషేధం ఎక్కడైనా జరిగిందా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

 

అంటే బాబు దృష్టిలో జగన్ కు కుర్ర చేష్టలు పోలేదని, పాలనా సరిగా చేయట్లేదనే విధానంలో మాట్లాడారు. అయితే జగన్‌వి కుర్ర చేష్టలు అవునో కాదో ప్రజలు ఎన్నికల్లో తేల్చేసారు. ఆ విషయం పక్కనపెడితే నిత్యవసరాల కోసం మూడు గంటలు, మద్యం కోసం ఎనిమిది గంటలు ఎందుకు ఇచ్చారనే పాయింట్ బాగానే ఉంది. కానీ ఓ వైపు మద్యం షాపులు ఎందుకు ఓపెన్ చేసారని ప్రశ్నిస్తున్న బాబు...మందు ధరలు ఎందుకు పెంచారని ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది.

 

అసలు మద్యం షాపులే ఓపెన్ చేయోద్దన్నప్పుడు బాబుకు మద్యం ధరలు గురించి ఎందుకో? అలాగే కల్తీ మద్యం అంటూ కూడా బాబు తెగ బాధపడిపోతున్నారు. అంటే బాబు ఇటు మందుబాబులు ఆగ్రహానికి గురికాకుండా,అటు మహిళల మెప్పు కోసం డబుల్ గేమ్ ఆడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: