ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం దుకాణాలు ఓపెన్ అయిన సంగతి అందరికీ తెలిసినదే. కేంద్రం అనుమతి ఇవ్వడంతో రాష్ట్రంలో కూడా మద్యం విక్రయాలు జరిపించడానికి జగన్ సర్కార్ డిసైడ్ అయింది. ముందు నుండి వైయస్ జగన్ మద్యపాన నిషేధం విషయంలో చాలా పకడ్బందీగా వ్యవహరిస్తున్న తరుణంలో..మే 17వరకు మందు షాపులు ఓపెన్ చెయ్యరు అని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా లిక్కర్ షాపులు ఏపీ లో ఓపెన్ కావటం తో మందు బాబులు ఫుల్ జోష్ మీద మద్యం షాపుల ముందు బారులు తీరారు. భయంకరంగా గుంపులుగుంపులుగా వెళ్లడంతో ఏపీ ప్రభుత్వం 25 శాతం పెంచిన మద్యం విక్రయాలను 50 శాతం గురించి మొత్తానికి 75% పెంచేసింది. దీంతో డబ్బులు లేక ఉన్న కొద్దిగా  డబ్బులతో ఏదోవిధంగా మందు చుక్కలతో గొంతు తడుపుకుందామని అనుకున్న మందుబాబుల కోరిక ఆవిరైపోయింది.

 

దీంతో చాలామంది మద్యానికి బానిసైన వాళ్ళు పక్కదారి వెతుక్కుంటున్నారు. పేద వారి కుటుంబాలు కూలి పోకూడదని మద్యానికి బానిసైన వాళ్లకి మద్యం రేట్లు షాక్ కొట్టే విధంగా జగన్ పెంచడం జరిగింది. అయితే ఈ సందర్భంలో పేదవాళ్లు పక్క దారి వెతుక్కుంటూ దొంగ సారాన్ని తాగుతున్నారు. ఈ పరిణామం తో మొత్తానికి ఎసరు పడుతుంది వాళ్ళ ఆరోగ్యానికి. గ్రామాల్లో చాలావరకూ బెల్టుషాపులు లేకపోవడంతో నాటుసారా కాస్తూ మద్యం ప్రియులను ఆకర్షిస్తున్నారు. ఇటువంటి పరిణామాల వల్ల చాలా కుటుంబాల్లో విషాదం నెలకొంది.

 

సో జగన్ మద్యం రేట్లను పెంచడం కాకుండా గ్రామాల్లో మరియు ఎక్కడైతే సారా లభ్యమవుతుందో వాటిపై కూడా దృష్టి సారిస్తే పేదవాడి ప్రాణాలను కాపాడిన వాళ్లమవుతాం అని మేధావులు అంటున్నారు. మరోపక్క మందుబాబుల ఆలోచన మారే విధంగా జగన్ ఏదైనా సరికొత్త కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా మొదలు పెడితే బాగుంటుందని సలహాలు కూడా ఇస్తున్నారు. ఎంత భయంకరంగా రేట్లు పెంచిన గాని వాళ్ళ ఆలోచనా ధోరణిలో మార్పు రాకపోతే... మొదటికే మోసం వస్తుందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: