ముహూర్తాన కేంద్రం లిక్కర్ విక్రయాలకు అనుమతినిచ్చిందో కానీ అప్పటి నుండే ప్రజలంతా తండోపతండాలుగా బార్లవైపు మళ్ళడం స్తార్ట్ చేశారు. ఇక క్రమంలో నిన్నటి నుండి మద్యం విక్రయాలు ప్రారంభం కాగా ఏపీలో లిక్కర్ కోసం జనం జాతరలా రావటం అందరికీ షాకింగ్ గా అనిపించింది. రోజు మరోమారు 50 శాతం ధరలను పెంచిన ఏపీ సర్కార్ ఇప్పటివరకు మొత్తం 75 శాతం లిక్కర్ ధరలను పెంచింది. ఇక లిక్కర్ ధరల విషయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.

 

తమ ప్రభుత్వం ఎప్పటికే మద్యపాన నిషేధానికే కట్టుబడి ఉంటుందని స్పష్టం చేసిన ఆయన…. ఇక మద్యపాన నియంత్రణలో భాగంగా మద్యం అమ్మకాల వేళలను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటవరకూ పరిమితం చేశామని...అందులో భాగంగానే 75 శాతం పెంపు నిర్ణయం కూడా తీసుకున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటికే ఢిల్లీలో 70 శాతం లిక్కర్‌ ధరలు పెంచారని ఇక క్రమంలోనే 75 శాతం పెంచి కొనుగోలు శాతం తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు సీఎం జగన్

 

 

ఇకపోతే ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 67 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1717కి చేరింది. మొత్తం 8263 శాంపిల్స్ పరీక్షించగా 67 మంది కోవిడ్19 పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. కరోనాకు చికిత్స తీసుకున్న అనంతరం ఇప్పటివరకు 589మంది డిశ్చార్జ్ కాగా, 34 మంది మృతి మరణించారు. తాజాగా గుజరాత్ వ్యక్తులు 14 మందికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌గా తేలింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: