ప్రభుత్వాలు ఎన్ని ఆంక్షలు విధించిన ప్రజలందరినీ ఇంటికే పరిమితం అవ్వాలని నిబంధనలు తీసుకొచ్చిన.... ప్రజలకు మహమ్మారి కరోనా వైరస్ పై  ఎంత అవగాహన కల్పించిన... ఎలాంటి ప్రయోజనం మాత్రం లేకుండా పోతుంది. రోజురోజుకు ఈ మహమ్మారి వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగి పోతూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ మహమ్మారి వైరస్ కు ఎలాంటి విరుగుడు కూడా లేకపోవడం మరింత భయాందోళనకు గురిచేస్తున్న అంశం.. అయితే మొన్నటి వరకూ తక్కువ మొత్తంలో కేసులు నమోదైన పూణేలో కూడా ప్రస్తుతం క్రమక్రమంగా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 

 

 

 పూణే జిల్లాలో విజృంభిస్తున్న మహమ్మారి వైరస్ కారణంగా జిల్లా వాసుల అందరి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఏకంగా పూణే జిల్లాలో 24 గంటల్లో 79 కొత్త కరోనా  వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఈ 79 కేసులతో కలిపి 2201 కేసులు నమోదైనట్లు గా ఆరోగ్య అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ఒక మంగళవారం రోజున ఈ మహమ్మారి వైరస్ బారినపడి 5 మంది  మరణించారని దీంతో మొత్తం మృతుల సంఖ్య 120 కి చేరుకుంది అంటూ ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. 

 

 

 అయితే నిన్న పూణే జిల్లాలో నమోదైన మొత్తం 79 కొత్త పాజిటివ్ కేసులలో... 63 కేసులు పూణే మున్సిపల్ కార్పొరేషన్ పరిమితిలో గుర్తించినట్లు తెలిపారు అధికారులు. ఇక గ్రామీణ మరియు కంటోన్మెంట్ ప్రాంతాల్లో కొత్తగా నాలుగు కేసులు నమోదు కావడంతో 125 కు చేరుకుంది మొత్తం కేసుల సంఖ్య. ఇలా రోజురోజుకు భారీగా  నమోదవుతున్న కేసులో దృష్ట్యా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యమా ప్రజల నిర్లక్ష్యమా అన్నది పక్కన పెడితే ఎంతో మంది ప్రజలు మృత్యువుతో పోరాడుతు...ప్రాణాలు వదలాల్సిన  పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: