వరికి పురుగు చేరినట్టుగా లోకానికి కరోనా వైరస్ సోకింది.. మరి ఈ వైరస్ సోకి ఎన్నో లక్షల మంది ప్రాణాలు కోల్పోగా, కోట్ల మంది ఈ వైరస్ బారిన పడ్ద విషయం తెలిసిందే.. దీంతో పాటే ఆర్ధిక వ్యవస్ద అంతా అయోమయంగా మారగా.. ప్రజల ప్రాణాలు రక్షించడానికి ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించాయి.. అయినా గానీ ఈ వైరస్ వ్యాప్తి ఆగిందా అంటే అదీ లేదు.. ఇక ముఖ్యంగా వైరస్ వ్యాప్తి ఆగాలంటే రావలసింది వ్యాక్సిన్ కాదు.. ప్రజల్లో మార్పు.. ఇలా అంటున్నానని చెడుగా అనుకోకండి.. ఎందుకంటే మనిషి చేతిలో ఉన్న ఐదు వేళ్లల్లో ఒక వేలు చెడిపోయిందనుకోండి డాక్టర్స్ ఏమంటారు.. చెడిపోయిన మీ వేలు తొలగించకుంటే మీ చేతికే ప్రమాదం.. తర్వాత మీ ప్రాణానికే ప్రమాదం అని చెబుతారు.. అలాగే సమాజంలో చెడు ఉన్నంత కాలం ఇలాంటి ఎన్ని రోగాలు వచ్చిన, వాటికి మందులు వచ్చిన ఉపయోగం ఏముంటుంది..

 

 

ఇప్పటికే కరోనా వల్ల మద్య పేద తరగతుల బ్రతుకులు చితికి పోయాయి.. అయినా ఏ ఒక్కరైనా జాలిపడుతున్నారా.. మా ఇంట్లో గల్లపెట్టే నిండితే చాలు అని ఒకడు అనుకుంటాడు.. మరొకడు ఇదే అదనుగా నిత్యావసర ధరలను అడ్దగోలుగా పెంచేస్తాడు.. ఇంకొకడు లోకం ఏమైపోతే నాకేంటి నా పెళ్లాం పుస్తెలు అమ్మి అయినా ఈరోజు మందు తాగుతా అని ఆలోచిస్తాడు.. ఇక ఆదిపత్యపోరు ఎలాగో ఉంది.. ఇలా వేలల్లో జీతాలు తీసుకునే వాడు, లక్షల్లో సంపాదించే వాడు.. కూటికి లేని పేదవాడు ఒకేలా ఆలోచిస్తే ఇక లోకంలో మంచితనం ఎక్కడ ఉంది.. ఇందులో గమనించవలసిన విషయం ఏంటంటే వ్యసనానికి బానిసగా మారిన వాడు ఇతరుల చెడునే కోరుతాడు గానీ వారి మేలును కోరుకోడు.. తాను బాగుపడాలి అనే స్వార్ధంతో కష్టజీవుల పొట్టను కొట్టే దరిద్రపు నాకొడుకులు ఈ లోకంలో ఎంత మంది ఉన్నారో మరి అలాంటి వారు శిక్షింపబడాలంటే ప్రకృతి, ఆ దైవం ఇలాంటి విపత్తులను కలిగిస్తుంది..

 

 

ఒకరకంగా సమాజానికి, లోకానికి అన్నీటికంటే మనుషుల వల్లే కీడు ఎక్కువగా జరుగుతుంది.. తన స్వార్ధం కోసం తోటి వారి జీవితాన్ని పణంగా పెట్టడానికి కూడా వెనుకాడని సమాజంలో జీవిస్తున్నందుకు మంచితనం ఉన్న ప్రతివారు సిగ్గు పడవలసిన విషయం.. అందుకే ప్రపంచం ఇంతలా నాశనం అవుతుంటే కొత్తగా కరోనా వచ్చి నాశనం చేసింది ఏముంది.. చాలా తక్కువే.. కరోనా విపత్తుకంటే భయంకరమైనవి మనుషుల ఆలోచనలే.. అవి సక్రమ మార్గంలో పయణించే వరకు ఇలాంటి వినాశకాలు ప్రపంచాని పలకరిస్తూనే ఉంటాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: