దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 199 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. కేంద్రం వైరస్ విజృంభిస్తూ ఉండటంతో ఈ నెల 17 వరకు లాక్ డౌన్ ను పొడిగించిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రం దేశవ్యాప్తంగా ఆరెంజ్, గ్రీన్ జోన్లలో సడలింపులు ఇచ్చింది. కేంద్రం సడలింపులు ఇవ్వడంతో దేశవ్యాప్తంగా మద్యం దుకాణాలతో పాటు ఇతర దుకాణాలు ఓపెన్ అయ్యాయి. 
 
లాక్ డౌన్ సడలింపుల వల్ల చాలా ప్రాంతాల్లో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో రద్దీ కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు ధరించకుండానే రోడ్లపైకి వస్తున్నారు. మద్యం షాపుల ముందు కిలోమీటర్ల మేర ప్రజలు బారులు తీరారు. దీంతో కరోనా కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం లాక్ డౌన్ సడలింపుల తర్వాత వివిధ రాష్ట్రాల్లో పరిస్థితుల గురించి నివేదికలు తెప్పించుకుంటోంది. 
 
కరోనా కేసుల సంఖ్యను బట్టి కేంద్రం లాక్ డౌన్ నిబంధనల్లో మార్పులు చేయనుందని సమాచారం. మరోవైపు కేంద్రం మే నెల 31 వరకు లాక్ డౌన్ ను పొడిగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కేంద్రం లాక్ డౌన్ ను పొడిగించటానికే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అనేక రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితుల గురించి కేంద్రం ఆరా తీస్తోందని తెలుస్తోంది. 
 
పీఎంవో ఉన్నతాధికారులతో మోదీ సమీక్ష నిర్వహించగా పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయకపోవడం వల్లే కేసుల సంఖ్య పెరిగినట్టు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కేంద్రం దేశంలోని 20 జిల్లాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉందని అభిప్రాయపడుతోంది. ఇప్పటికే కేంద్రం కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: