కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కరంగా మే 4 వ తారీఖు నుండి కొన్ని రాష్ట్రాలలో మద్యం దుకాణాలు తెల్రుచుకున్న సంగతి తెలిసిందే. దీనితో మందుబాబులు గత 40 రోజుల నుండి లేని మందును కొనడానికి అన్ని మరిచిపోయి ఎండా, వాన అనకుండా కిలోమీటర్ల మీరు క్యూ లైన్ లలో మద్యం కొనడానికి నిలబడ్డారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈ విష్యం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే రాష్ట్రంలో మందుబాబులు ప్రవర్తించిన తీరు అలాంటిది మరి.

 

అయితే ఇక పక్క రాష్ట్రాల మూలంగా తెలంగాణ రాష్ట్రంలోనూ వైన్ షాపులను తెరవబోతున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్.. అలాగే ఇక లిక్కర్ రేట్లను కూడా పెంచుతున్నట్లు చెప్పారు. నిన్న రాత్రి మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్ గ్రీన్, ఆరెంజ్ జోన్లతో పాటు రెడ్ జోన్లలోనూ మద్యం దుకాణాలు తెరుస్తామని ఆయన స్పష్టం చేశారు. కాకపోతే కేవలం 15 కంటైన్మెంట్ జోన్లలో మాత్రం మద్యం షాపులు అసలు తెరవడం లేదని స్పష్టం చేశారు ఆయన. 

 


ఇకపోతే బార్లు, పబ్‌ లు లాంటివి మాత్రం తెరుచుకోవని తెలిపారు. ఇక ఈ సమయంలో మద్యం ధరలను పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని, అందుకే.. చీప్ లిక్కర్ ‌పై 11 %, మిగతా బ్రాండ్లపై 16 % పెంచుతామని అన్నారు. ఇకపోతే కొత్త ధరలను నిర్ణయించింది ప్రభుత్వం. ఆ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామా ...!

 

ఆర్డినరీ :  90 ఎంఎల్/180 ఎంఎల్ - రూ.10 , 375 ఎంఎల్ - రూ.20 , 750 ఎంఎల్ - రూ.40 

 

మీడియం : 90 ఎంఎల్/180 ఎంఎల్ - రూ.20 , 375 ఎంఎల్ - రూ.40 , 750 ఎంఎల్ - రూ.80 

 

ప్రీమియం :  90 ఎంఎల్/180 ఎంఎల్ - రూ.30 , 375 ఎంఎల్ - రూ. 60 , 750 ఎంఎల్ - రూ. 120 

 

స్కాచ్ :   90 ఎంఎల్/180 ఎంఎల్ - రూ.40 , 375 ఎంఎల్ - రూ. 80 , 750 ఎంఎల్ - రూ. 160

 

ఇక బిర్ల విషయానికి వస్తే అన్ని బ్రాండ్ల మీద ఫ్లాట్ రూ.30 లను పెంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: