కేంద్ర ప్రభుత్వం మూడో దశ లాక్ డౌన్‌ మినహాయింపులు ఇచ్చిన వాటిలో దేశ వ్యాప్తంగా మద్యం దుకాణాలు ఓపెన్ చేసుకోవచ్చని పర్మిషన్ ఇవ్వడం మనకందరికీ తెలిసినదే. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ క్యూ పద్ధతిలో అమ్మకాలు జరపాలని ఈ సందర్భంగా షరతు విధించింది. దీంతో ఒక్కసారిగా మందుబాబులు కి ప్రాణం లేచి వచ్చినట్లయింది. సోషల్ మీడియాలో బార్ షాపులు ముందు మందుబాబులు చేస్తున్నా వికృత చేష్టలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. కొంతమంది సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా విక్రయాలు చేస్తుంటే మరికొంతమంది మాస్కు లు పెట్టుకోకుండా ఒకరిమీద ఒకరు పడుతూ కనిపిస్తున్నారు. కనబడుతున్న దృశ్యాలు బట్టి చూస్తే కరోనా మళ్లీ విలయ తాండవం చేస్తుందేమో అన్న భయం కలుగుతోంది.

 

ఈ దృశ్యాలన్నీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం మద్యం విక్రయాలు విషయంలో మందుబాబులు చేస్తున్న ఆగడాలకు ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయం నడుస్తూ ఉండగానే మరోపక్క కేసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవనివ్వలేదు. ఏడో తారీఖు వరకు షరతులు విధించిన కేసీఆర్ ఇతర రాష్ట్రాల పరిస్థితి బట్టి చూసి నిర్ణయం తీసుకునే ఆలోచనలో మొన్నటి వరకు ఉన్నారు.

 

అయితే తాజా పరిస్థితులను బట్టి చూస్తే మే 8వ తారీఖు నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ లలో అమ్మకాలు జరిపించడానికి కేసీఆర్ రెడీ అవుతున్నట్లు సమాచారం. మరోపక్క వైద్య నిపుణులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధంగా వ్యవహారం మద్యం దుకాణాలు దగ్గర ఉంటే పాజిటివ్ కేసులు ఉన్న కొద్ది బయటపడతాయని అంటున్నారు. అంతేకాకుండా మూడో దశకు కరోనా వైరస్ వెళ్ళిన ఆశ్చర్యపోనవసరం లేదని కాబట్టి మద్యం దుకాణాల దగ్గర జాగ్రత్తలు తీసుకుంటే చాలా బెటర్ అవుతుందని సూచిస్తున్నారు. అందుకే మద్యం విషయం లో కేసిఆర్ చాలా బి కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: