ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌కు విరుగుడు ఎప్పుడు క‌నిపెడ‌తారో ? అస‌లు క‌రోనాకు ముందు క‌నుగొంటారా ? ఇది ఎప్పుడు జ‌రుగుతుందో ?  ఎవ్వ‌రికి తెలియ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ క‌రోనాకు విరుగుడు క‌నిపెట్టే అంశంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అంతా మంచిగా ఉంటే వ‌చ్చే సెప్టెంబ‌ర్ నాటికి జినోమ్ వ్యాలీ నుంచి క‌రోనా వ్యాక్సిన్ వ‌స్తుంద‌న్న ఆశాభావాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. అస‌లు అప్ప‌ట‌కి మందు వ‌స్తుందా ?  ప్ర‌యోగ ద‌శ‌లో ఉంటుందా ? అన్న విష‌యం ప‌క్క‌న పెడితే కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు మాత్రం సామాన్య ప్ర‌జ‌ల నుంచి ప్ర‌తి తెలుగు వారికి ఓ ధైర్యాన్ని అయితే ఇచ్చాయి. 

 

కేసీఆర్ క‌రోనా వ్యాక్సిన్‌కు మందు క‌నుగోనే అంశంపై మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ‌లోని ప్ర‌తిష్టాత్మ‌కంగా ఉన్న జినోమ్ వ్యాలీ నుంచి క‌రోనా వ్యాక్సిన్ వ‌స్తుంద‌ని ఆయ‌న తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తెలంగాణ‌లో ప్ర‌తిష్టాత్మ‌క జినోమ్ వ్యాలీలో క‌రోనాకు మందు తెచ్చేందుకు ఇక్క‌డ ఉన్న ఔష‌ధ సంస్థ‌లు ప‌డుతోన్న క‌ష్టం అంతా ఇంతా కాద‌ని కేసీఆర్ కొనియాడారు. వీరి కృషి ఫ‌లిస్తే ఆగ‌స్టు లేదా సెప్టెంబ‌ర్ నాటికి క‌రోనాకు వ్యాక్సిన్ వ‌స్తుంద‌ని చెప్పారు.

 

అదే జ‌రిగితే మ‌న తెలంగాణ దేశానికే కాకుండా.. ప్ర‌పంచానికి కూడా ఆద‌ర్శంగా నిలుస్తుంద‌ని చెప్పారు. ఇక రాష్ట్రానికే చెందిన శాంతా బ‌యోటెక్ ఎండీ వ‌ర‌ప్ర‌సాద‌రెడ్డి త‌న‌తో మాట్లాడార‌ని.. ఆయ‌న క‌రోనాకు వ్యాక్సిన్ కోసం చాలా సీరియిస్‌గా ప‌రిశోధ‌న‌లు చేస్తున్న‌ట్టు చెప్పార‌ని కేసీఆర్ తెలిపారు. ఏదేమైనా కేసీఆర్ ఆకాంక్షించిన‌ట్టుగానే ఆగ‌స్టు లేదా సెప్టెంబ‌ర్ నాటికి నిజంగానే జినోమ్ వ్యాలీ నుంచి క‌రోనాకు వ్యాక్సిన్ వ‌స్తే కేసీఆర్ నిజంగానే ప్ర‌పంచానికి ఆద‌ర్శ‌మైపోతార‌న‌డంలో సందేహం లేదు. ఇక కేసీఆర్ క‌రోనా విష‌యంలో చాలా సీరియ‌స్‌గా ఉన్నారు.. భార‌త్‌లోని మిగిలిన రాష్ట్రాల‌తో సంబంధం లేకుండా తెలంగాణ‌లో స్ట్రిక్ట్‌గా లాక్‌డౌన్ అమలు చేయిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: