క‌రోనా క‌ష్ట‌కాలంలో కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు కీల‌క నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.  పెట్రోల్‌, డీజీల్‌పై వివిధ రాష్ట్రాలు వ్యాట్‌ పెంచడం, కేంద్రం కూడా ట్యాక్స్‌లు విధించాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగాయి. ఫ్యూయల్స్‌పైన ఢిల్లీ సర్కార్‌‌ వ్యాల్యూ యాడెడ్‌ ట్యాక్స్‌ (వ్యాట్‌) పెంచడంతో పెట్రోలపై లీటర్‌‌కు 1.67 పైసలు, డీజిల్‌పై రూ.7.10పైసలు పెరిగాయి. చెన్నై , అస్సాం, హర్యానా, నాగాలాండ్‌, కర్నాటక, లెస్ట్‌ బెంగాల్‌ రాష్ట్రాలు కూడా ఇప్పటికే వ్యాట్‌ పెంచడంతో ఆయా రాష్ట్రాల్లో కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగాయి. ఈ పెంపుపై మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఘాటుగా స్పందించారు. దేశ ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పుడు ప్రజలకు ప్రభుత్వం సాయం చేయాలని అలాంటిది ప్రభుత్వమే ప్రజల నుంచి వసూలు చేస్తోందని ఆయ‌న మండిప‌డ్డారు. 

 

కరోనా వైరస్‌ సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థ పతనమవుతున్న నేపథ్యంలో ఆదాయాన్ని పెంచుకునే ఉద్దేశంతో కేంద్రం పెట్రోల్,  డీజిల్‌పై ఎక్సైజ్‌ ట్యాక్స్‌ను భారీగా పెంచింది. లీటర్‌‌ పెట్రలోపై రూ.10, డీజిల్‌పై రూ.13 పెంచింది. అయితే రీటైల్‌ అమ్మకాలపై ఈ పన్ను భారం ఉండదు. మరోవైపు ఢిల్లీ సహా దేశంలోని వివిధ రాష్ట్రాలు పెట్రోల్‌, డీజిల్‌పై ట్యాక్స్‌ను పెంచాయి. పుతో ఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.71.26కు చేరుకుంది. పెంపుకు ముందు పెట్రోల్‌ ధర రూ.69.59. డీజిల్‌ ధర గతంలో 62.29 కాగా.. పెంపు తర్వాత అది రూ.69.39కి చేరింది.

 

పెట్రోల్‌, డీజీల్‌పై వివిధ రాష్ట్రాలు వ్యాట్‌ పెంచడం, కేంద్రం కూడా ట్యాక్స్‌లు విధించడాన్ని చిదంబరం త‌ప్పుప‌ట్టారు. లోటులో ఉంటే అప్పులు తీసుకోవాలని, ట్యాక్స్‌ల రూపంలో ప్రజలపై భారం వేయడం కరెక్ట్‌ కాదని ఆయన అన్నారు. “ కొత్త, అధిక ట్యాక్స్‌లు వల్ల భవిష్యత్తులో చాలా కుటుంబాలు ఇబ్బందులు పడతాయి. లోటును తీర్చుకునేందుకు ప్రభుత్వాలు అప్పులు తీసుకోవాలి. కానీ జనంపై భారం మోపకూడదు. ఇబ్బందుల్లో ఉన్నాం సాయం చేయమని ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటుంటే ప్రభుత్వం రివర్స్‌ ట్రాన్స్‌వర్‌‌ చేయించుకుంటుంది. ఇది దారుణం” అని చిదంబరం పేర్కొన్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: