చరిత్రాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకోవ‌డం కొంద‌రు నేత‌ల‌కే సాధ్య‌మ‌వుతుంది. అత్యంత సంక్లిష్ట ప‌రిస్థితుల్లోనూ ప్ర‌జా సంక్షేమం కోసం సాహ‌సిక అడుగులు వేయ‌డం ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కే సాధ్య‌మ‌వుతుంది. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను ఆదుకునేందుకు వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద వేట నిషేధ భృతి చెల్లింపులను బుధవారం సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్‌ జగన్‌తోపాటు మంత్రి మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని హాజరు అయ్యారు. వివిధ జిల్లాల నుంచి కలెక్టర్లు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పథకం కింద మత్స్యకారుల ఖాతాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ. 10 వేలు  జమ చేస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం లక్షాల 9 వేల 231 మంది లభ్దిదారులకు ప్రయోజనం చేకూరుతుంది.

 

గతంలో మత్స్యకారుల విరామ భృతి 4 వేలు ఉండగా.. సీఎం వైఎస్ జగన్ దానిని 10 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ప్రభుత్వం తమను ఆదుకోవడంతో లబ్ధిదారులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎ జ‌గ‌న్ మ‌రో చ‌రిత్ర సృష్టించార‌ని కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నారు.  కాగా, పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన సీఎం మత్స్యకారులతో మాట్లాడారు. మత్స్యకారుడు వేటకు వెళ్లినప్పుడు జరగరానిది జరిగితే.. రూ. 5లక్షలు సరిపోదని రూ.10 లక్షలు ఇస్తున్నామ‌ని, ఇలా ప్రతి విషయంలోకూడా మత్స్యకారులకు మంచి చేయడానికి ప్రయత్నాలు చేశామ‌ని.. దేవుడి దయతో ఇవన్నీకూడా చేయగలిగామ‌ని ఆయ‌న అన్నారు. 8 మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్లు కట్టబోతున్నామ‌ని.. 1 ఫిష్‌ ల్యాడింగ్‌ కేంద్రాన్ని కట్టబోతున్నామ‌ని.. ఈ తొమ్మిందింటికి దాదాపు రూ.3 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని జ‌గ‌న్ తెలిపారు. 3 సంవత్సరాల్లో ఈ 9 నిర్మాణాలను కూడా పూర్తిచేస్తామ‌ని అన్నారు. శాశ్వతంగా మంచిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూఈ కార్యక్రమాలు చేస్తున్నామ‌ని అన్నారు. మత్స్యకారుల జీవితాల్లో శాశ్వతంగా మార్పు రావాలని.. గుజరాత్‌ లాంటి ప్రాంతాలకు వలస పోకూడదని, శాశ్వత పరిష్కారంగా మంత్రి మోపిదేవి మంత్రిగా బాధ్యతలు చేపట్టినుంచి కృషిచేసి.. వీటికి అనుమతులు కూడా తీసుకొచ్చారని సీఎం జ‌గ‌న్ పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: