ప్రపంచంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందినప్పటి నుంచి ఆ పేరు చెబితేనే ముచ్చెమటలు పడుతున్నాయి.  ఎంత పెద్ద నేరస్తుడైనా అరెస్ట్ చేయడానికి వెళ్తే అతనికి కరోనా ఉందని తెలిస్తే పోలీసులు పడుతున్న టెన్షన్ అంతా ఇంతా కాదు. ప్రతిరోజూ దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తూనే ఉంది. బయటకు వచ్చిన వారే కాదు జైలులో ఉన్న వారికి కూడా వైరస్ సోకుతోంది. ఈ క్రమంలోనే ఓ కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో పోలీసుకు టెన్షన్ మొదలైంది. ఆ మద్య నేరస్తులను పట్టుకున్న పాపానికి పోలీసులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అంతే కాదు ఆ మద్య ఓ యువ ఐపీఎస్ ట్రైనీకి దొంగని చేజ్ చేసిన మరీ పట్టుకున్నాడు.. తర్వాత తెలిసింది ఆ దొంగకు కరోనా ఉందని.. దాంతో మనోడికి కరోనా సోకింది.  ఇలా కరోనా వల్ల మనిషిని మనిషి తాకాలన్న ఇబ్బందులు పడిపోతున్నారు. 

 

ఈ నేపథ్యంలో ఓ కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్‌కు కరోనా పాజిటివ్ సోకడంతో అక్కడి పోలీసులు టెన్షన్లో పడ్డారు. పంజాబ్‌కు చెందిన కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ జగ్గూ భగవాన్‌పూరియా కరోనా మహమ్మారి బారిన పడ్డాడు. ఈ మేరకు బటాలా జిల్లా ఎస్పీ ప్రకటించారు. ఓ హై ప్రొఫైల్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న అతడు ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడు.  వెంటనే అతన్ని క్వారంటైన్ చేశారు. ఇతన్ని విచారించేందుకు డీఎస్పీ స్థాయి అధికారులు కూడా రావడంతో వారంతా స్వీయ గృహ నిర్భందంలోకి వెళ్లారు.  

 

జైలులో జగ్గూకు కరోనా ఎలా సోకిందనే మిస్టరీగా మారింది.  దీని వల్ల మరింత మందికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని టెన్షన్ పడుతున్నారుపోలీసులు.  ఇటీవలే జగ్గూను పాటియాలా జైలు నుంచి బటాలా జైలుకు అతనితో పాటు మరికొంత మందిని తరలించారు. ఈ క్రమంలోనే వైరస్ సోకి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: