గ్యాస్ సిలిండర్ వినియోగిస్తున్న వారి అందరికీ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ సబ్సిడీ డబ్బులు డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లో జమ అవుతాయి. ఇక ఈ గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసిన ప్రతిసారి కూడా సబ్సిడీ డబ్బులు వారి బ్యాంక్ అకౌంట్లో పడుతాయి. అయితే ఒక సంవత్సరంలో గరిష్టంగా 12 LPG సిలిండర్ లకు మాత్రమే సబ్సిడీ డబ్బులు జమవుతాయి. ఆ తర్వాత ఎలాంటి సబ్సిడీ వర్తించదు. అప్పుడు గ్యాస్ సిలిండర్ పూర్తి డబ్బులు కచ్చితంగా చెల్లించాల్సిందే. ఇక మరికొంతమందికి గ్యాస్ సిలిండర్ డబ్బులు వస్తున్నాయా లేదా అని తెలుసుకోవాలని అనుకుంటున్నారా. దీని కోసం బ్యాంకుకి వెళ్లవలసిన అవసరం లేకుండా ఇంటివద్దనే చెక్ చేసుకోవచ్చు.

 

oil CORPORATION' target='_blank' title='ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్ సైట్ ప్రకారం ఇండియన్ గ్యాస్ వినియోగదారులు అందరూ కూడా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు వస్తున్నాయో లేదో అని తెలుసుకోవచ్చు. మొబైల్ ఫోన్ ద్వారానే సబ్సిడీ ట్రాన్స్ఫర్ విషయాన్ని వినియోగదారులు సులువుగా తెలుసుకోవచ్చు. ఇలా తెలుసుకోవడానికి ముందుగా సిలిండర్ కంపెనీ వెబ్ సైట్ లో లాగిన్ అవ్వాలి. అనంతరం చెక్ పహల్ స్టేటస్ అనే ఒక లింకుపై క్లిక్ చేయాలి. ఇందులో రెండో ఆప్షన్ లో ఉన్న స్టేటస్ తెలుసుకోవచ్చు అప్పుడు డిస్ట్రిబ్యూటర్ పేరు LPG ID లేదా ఆధార్ నెంబర్ కస్టమర్ ఐడి ద్వారా డబ్బులు జమ అయ్యాయో లేదో స్టేటస్ తెలుసుకోవచ్చు. ఒకవేళ సబ్సిడీ డబ్బులు మూడు రోజులలో మీకు క్రెడిట్ అవ్వకపోతే బ్యాంకు అధికారులకు సంప్రదించండి.

 


ఇక తాజాగా గ్యాస్ సిలిండర్లపై భారీగా ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసినదే. దాదాపు 214 రూ. 214 లు గ్యాస్ సిలిండర్ డబ్బులు తగ్గాయి. ఇక ఈ కొత్త గ్యాస్ సిలిండర్ రేటు మే 1 నుంచి అమలులోకి రావడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: