సోమవారం నుండి ప్రాంభమైన మూడో దశ లాక్ డౌన్ లో మద్యం షాపులను ఓపెన్ చేసుకోవడానికి కేంద్రం గ్రీన్ ,ఆరెంజ్ జోన్లలలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో చాలా రాష్ట్రాల్లో వైన్స్ ఓపెన్ అయ్యాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అందులో  కర్ణాటక ఒకటి. మొదటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా 45కోట్ల రూపాయల మద్యం అమ్ముడయిందని ఆ రాష్ట్ర ఏక్సైజ్ శాఖ తెలిపింది.
 
ఇక రెండో రోజు మాత్రం లిక్కర్ సేల్ లో కర్ణాటక ఆల్ టైం రికార్డు కొట్టింది. నిన్న ఒక్క రోజే 197 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయట. సింగిల్ డే లో ఇప్పటివరకు ఇదే హైయెస్ట్. ఇంతకుముందు 2019 డిసెంబర్ 28న 170 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అయితే మొదటి రోజు  కంటే రెండో రోజు రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో మద్యం షాపులు తెరుచుకోవడం అలాగే ఒకవేళ కరోనా ప్రభావం పెరిగితే షాపులు మూసివేసే అవకాశం ఉండడంతో మందుబాబులు కొన్ని రోజులకు సరిపడా మద్యం  కొనుగోలు చేశారు. దాంతో మంగళవారం రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. 
 
ఇదిలావుంటే ప్రస్తుతం అందరి చూపు తెలంగాణ పైనే వుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజే వైన్ షాపులు తెరుచుకోగా దాదాపు ప్రతి షాపు వద్ద భారీ క్యూ లైన్లు దర్శనమిచ్చాయి. రెడ్ జోన్లలో కూడా షాపులు తెరవడం తో తొలి రోజు 100కోట్ల కు పైగా మద్యం అమ్మకాలు జరగొచ్చని ఏక్సైజ్ శాఖ అంచనా వేస్తుంది. పైగా  రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలను కూడా పెంచింది. అన్ని రకాల బ్రాండ్ లపై 16శాతం చీఫ్ లిక్కర్ పై  మాత్రం  11 శాతం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఏకంగా 75 శాతం ధరలను  పెంచి మద్యాన్ని విక్రయిస్తున్నారు అయినా కూడా  మందుబాబులు మాత్రం  వెనక్కు తగ్గడం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: