స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటం లో కీలకంగా వ్యవహరించిన నిమ్మగడ్డ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో ఉన్న కొద్ది ఉధృతంగా మారుతోంది. తీగ లాగితే డొంక కదిలినట్లు నిమ్మగడ్డ వ్యవహారం మొత్తం సీఐడీ విచారణలో బయటపడుతోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖకి రాసిన లెటర్ విషయంలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఐదు పేజీల లేఖలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలి అని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తో కలసి పన్నిన కుట్ర బయట పడే రోజు మరెంతో దూరంలో లేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్రానికి రాసిన లేఖ ఎన్నికల సంఘం కార్యాలయంలో తయారు చేయలేదని అది టిడిపి కార్యాలయంలో తయారయిందని డ్రాఫ్ట్ చేశారని ఆరోపించడంతో పాటు ఈ విషయం పై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిజాలు వెలుగులోకి తీసుకు రావాలి అంటూ బీజేపీకి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేయడం మనకందరికీ తెలిసిందే.

 

ఈ ఫిర్యాదుతో ఉలిక్కిపడ్డ నిమ్మగడ్డ వెంటనే తానే ఆ లేఖ రాసినట్లు అంగీకరించాడు. అయితే లేక తయారీని నిగ్గు తేల్చేందుకు సిఐడి దర్యాప్తుకు డీజీపీ ఆదేశించడం జరిగింది. దీంతో ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ నేతృత్వంలో రంగంలోకి దిగిన సిఐడి అధికారులు కూపి లాగడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ పీఏ సాంబమూర్తి ని  విచారించడం జరిగింది. అయితే విచారణలో చెప్పిన విషయాలకు ఫోరెన్సిక్ ల్యాబ్ లో వస్తున్న ఫలితాలకు పొంతన కుదరడం లేదని సిఐడి అధికారులు తేల్చేశారు.

 

తమకు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఆ లెటర్ ప్రభుత్వ కార్యాలయంలో తయారు కాలేదని సీఐడీ అధికారుల విచారణలో నిర్ధారణ అయింది. లాప్ టాప్, డెస్క్ టాప్ పరిశీలించిన ఫోరెన్సిక్ అధికారులు ఆ లెటర్ ఎన్నికల సంఘం కార్యాలయంలో తయారు కాలేదని తేల్చి చెప్పారు. మొత్తం నిమ్మగడ్డ పర్సనల్ అసిస్టెంట్ చెప్పింది కూడా అబద్ధాలు అని పేర్కొన్నారు. లెటర్ బయటనుండి తయారయిందని నిర్ధారణకు వచ్చారు. దీంతో త్వరలోనే భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సిఐడి అధికారులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: