ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ కి భారీ షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. 2019 ఎన్నికల్లో కేవలం 23 సీట్లకే పరిమితమయి చావు దెబ్బ టిడిపి నుండి మొదటిలోనే ముగ్గురు బయటకు వచ్చేయడం జరిగింది. ఆ ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు ఒకసారి చూస్తే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు జిల్లా పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరిధరరావు టీడీపీకి దూరం కాగా ఇక మరో సీనియర్ నేత ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం ఎమ్మెల్యే కరణం బలరాం కృష్ణ ముందుగా తన కుమారుడు కరణం వెంకటేష్ ని వైసీపీలో చేర్పించిన విషయం అందరికీ తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతం టీడీపీకి 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.

 

వీరిలో ఎప్పుడు ఎవరు ఎలా చంద్రబాబుకి షాక్ ఇస్తారో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా తాజాగా టీడీపీలో మరో బిగ్ వికెట్ టిడిపిలో ప్రముఖ నాయకుడు చంద్రబాబు కి షాక్ ఇవ్వడానికి రెడీ అయినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినపడుతున్నాయి. సదరు ఎమ్మెల్యే మరెవరో కాదు ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అట. గతంలో వరుసగా కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన రవికుమార్, రాష్ట్రం విడిపోయిన తరువాత 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచారు.

 

ఆ తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ తో గొట్టిపాటి చంద్రబాబు పార్టీలో చేరడం జరిగింది. ఇక 2019 ఎన్నికల్లో టిడిపి చిత్తుగా ఓడిపోయినప్పటికీ రవికుమార్ మాత్రం అద్దంకిలో విజయాన్ని నమోదు చేసుకోవటం విశేషం. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఓటమి అనేది లేకుండా నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే గా రవి కుమార్ ఉన్నారు. అయితే ఇటీవల టీడీపీలో ఉండే హైకమాండ్ నేతలకు రవి కుమార్ కి మధ్య సరైన మాటలు లేకపోవటంతో త్వరలో రవి కుమార్ వైసీపీ పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రకాశం జిల్లాలో వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: