దేశంలో నానాటికీ కరోనా కేసులు.. మరణాల సంఖ్య పెరిగిపోతూనే ఉంది.  దాంతో లాక్ డౌన్ మరికొంత కాలం పెంచే పరిస్థితి ఏర్పడింది.  వాస్తవానికి గత నెల 14 వరకు లాక్ డౌన్ ఉన్నా.. ప్రధాని మోదీ ఈ నెల 3 వరకు పెంచారు. కానీ కరోనా పూర్తి స్థాయిలో అరికట్టలేకపోవడంతో ఈ నెల 17 వరకు కరోనా లాక్ డౌన్ పొడిగించారు.  ఆ నాటి పరిస్థితిని బట్టి ఏ విషయం అయినదీ చెబుతామని అన్నారు. అయితే లాక్ డౌన్ కొన్ని చోట్ల వెసులు బాటు కల్పిస్తున్న విషయం తెలిసిందే.  దేశ వ్యాప్తంగా కరోనాని మూడు రకాలుగా విభజించారు.  కేసులు లేని చోట గ్రీన్ జోన్.. తక్కువ కేసులు ఉన్న చోట ఆరెంజ్ జోన్.. కోనా కేసులు తీవ్రంగా నమోదు అయిన చోట రెడ్ జోన్లుగా విభజించారు.  అయితే లాక్ డౌన్ వల్ల ఎంతో మంది నిరుపేదలు ఎన్నో కష్టాలు పడుతున్నారు.

 

 ముఖ్యంగా చిరు వ్యాపారులు, ట్యాక్సీ డ్రైవర్లు, ఆటో రిక్షావాలు నానా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా వీరి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని క‌ర్నాట‌క ప్ర‌భుత్వం కొత్త‌గా రిలీఫ్ ప్యాకేజీ ప్ర‌క‌టించింది.  ఆటో, ట్యాక్సీ డ్రైవ‌ర్ల‌తో పాటు నాయీ బ్రాహ్మ‌ణుల‌కు కూడా రూ.5 వేలు ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం చెప్పింది. ఒకసారి ఆ అమౌంట్‌ను ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. య‌డ్డీ ప్ర‌భుత్వం మొత్తం 1600 కోట్ల ప్యాకేజీ ప్ర‌క‌టించింది. రైతులు, చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా వ్యాపారుల‌కు దీనితో ల‌బ్ధి చేకూర‌నున్న‌ది.

 

పువ్వులు సాగు చేసే రైతుల‌కు హెక్టార్‌కు 25వేలు ఇవ్వ‌నున్నారు. అంతే కాదు బట్టలు ఉతికేవారి, బార్బ‌ర్ల‌కు 5వేలు ఇవ్వ‌నున్నారు. భ‌వ‌ణ నిర్మాణ కార్మికుల‌కు ఇప్ప‌టికే రెండు వేలు ఇచ్చారు. ఇప్పుడు అద‌నంగా మ‌రో 3వేలు ఇవ్వ‌నున్నారు.  చేనేత కార్మికుల‌కు కూడా ఒక్కొక్కరికి బ్యాంక్ అకౌంట్ల‌లో రెండు వేల జ‌మ చేస్తారు. చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌కు రెండు నెల‌ల విద్యుత్తు బిల్లును మాఫీ చేస్తున్నామని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: