తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై విపక్ష నేతల ఫైరవుతున్నారు . విపక్ష నేతలపై  కెసిఆర్ తీవ్రస్థాయి లో విరుచుకుపడిన విషయం  తెలిసిందే .రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోళ్లలో  అవకతవకలు జరుగుతున్నాయని విపక్ష నేతల నిరసన తెలియజేశారు .అయితే విపక్షాల అనవసర రాద్ధాంతాన్ని చేస్తున్నాయని కెసిఆర్ మండిపడ్డారు . జోకర్లు ...బఫూన్లు అంటూ విపక్ష నేతలను తూలనాడారు .ధాన్యం  కొనుగోళ్ల సందర్బంగా గన్ని బ్యాగ్ లేకపోవడం  తో , కొనుగోళ్ళకు ఆటంకాలు ఎదురవుతున్నాయని విపక్ష నేతల పేర్కొంటున్నారు .

 

లాక్ డౌన్ సందర్బంగా లారీ రవాణా వ్యవస్థ లేకపోవడంతో , రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని చెప్పుకొచ్చారు . ఆకాల వర్షాల కారణంగా కళ్లెంలో  పోసిన ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారని విపక్ష నేతలు పేర్కొంటున్నారు .ధాన్యం కొనుగోళ్లు సందర్బంగా తాలు పేరిట రైతుల నుంచి అధిక ధాన్యం  దండుకుంటున్నారని ఆరోపించారు . అయితే విపక్షాలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని కెసిఆర్ కొట్టిపారేశారు .గతంలో ఏ  ప్రభుత్వం కూడా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన దాఖలాలు లేవన్నారు .రైతు పండించిన ప్రతి గింజ  కొనుగోలు  చేస్తామని చెప్పిన ప్రభుత్వం తమదని కెసిఆర్ చెప్పుకొచ్చారు  . ఇప్పటికే  రాష్ట్ర వ్యాప్తంగా  ఏడువేల ధాన్యం  కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల నుంచి ధాన్యం  కొనుగోలు చేస్తున్నామన్నారు . 

 

ధాన్యం  కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ౩౦ వేలకోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు . అయినా విపక్షాలకు  ప్రభుత్వం చేస్తోన్న ధాన్యం కొనుగోళ్లు  కన్పించడం లేదని ఎద్దేవా చేశారు . తమది రైతు పక్షపాత ప్రభుత్వమని చెప్పుకొచ్చారు . దేశం లోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా రైతాంగ మేలు కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు . రైతుబంధు పథకం పై కూడా కొంతమంది అవాకులు , చెవాకులు పేలుతున్నారని విమర్శించారు. తాను బ్రతికున్నంత వరకు , టీఆరెస్ అధికారం లో ఉన్నంత వరకు ఈ పథకాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: