కౌన్ బనేగా కరోడ్ పతి... ఈ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రియాల్టీ షోలలో అత్యధిక పేరుగాంచిన కార్యక్రమం ఏదైనా ఉంది అంటే అది ఇదే. ఇప్పటివరకు ఈ షో 11 సీజన్ లను పూర్తి చేసింది. ఇందుకుగాను బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా పనిచేశారు. అయితే తాజాగా 12వ సీజన్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.

IHG


ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... ప్రపంచం మొత్తానికి టీవీ ప్రేక్షకులను అలరిస్తున్న అతిపెద్ద గేమ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి. అతి త్వరలో మరొకసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది ఈ కార్యక్రమం. ఇందుకుగాను కెబిసి రిజిస్ట్రేషన్ల పక్రియ మే 9 తారీకు నుంచి అనగా రాబోయే శనివారం రాత్రి 9 గంటల నుంచి మొదలు అవుతున్నట్టు జీటీవీ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో తెలిపింది.

IHG

లాక్ డౌన్ జరుగుతుండగానే ప్రేక్షకుల ముందుకు రావాలి అన్న ఆలోచనతో పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు జీటీవీ సంస్థ వారు. అయితే ఇందుకు సంబంధించిన ప్రోమో తయారీ షూటింగ్ ముంబై నగరంలో జరిగింది. దీని కోసం అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకొని ఉదయం 6 గంటల నుంచి ఆపకుండా రెండు రోజుల షూటింగ్ పనులను కూడా ఒకే ఒక్క రోజులో పూర్తి చేసినట్లు సంస్థ తెలిపింది. అమితా బచ్చన్ మోకాలి కండరాల ద్వారా నొప్పి ఉన్నప్పటికీ అందరి అభిమానంతో షూటింగ్ పూర్తి చేయగలిగానని ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్ల కొరకు ప్రోమో షూటింగ్ ను అమితాబచ్చన్ ఇంటి నుంచి జరగగా రిమోట్ ద్వారా దంగల్ నితీష్ తివారి డైరెక్షన్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: