దేశంలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. ప్రతిరోజూ దేశంలో 2,500కు పైగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సీఎం జగన్, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కరోనా ప్రభావం మరికొంతకాలం ఉండవచ్చని... కరోనాతో కలిసి జీవనం సాగించాలని వ్యాఖ్యలు చేశారు. ఐతే సింగపూర్ యూనివర్సిటీ వేసిన అంచనాలో మాత్రం ఈ నెల చివరివారం నాటికి కరోనా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తేలింది. 
 
ఇండియా కరోనా వైరస్ ప్రమాదకర స్థాయిని దిగ్విజయంగా దాటేసిందని పేర్కొంది. జూన్ మొదటి వారం లోపు కరోనా 99 శాతం తగ్గుతుందని సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ నివేదిక ఇచ్చింది. జులై 25వ తేదీ నాటికి భారత్ 100 శాతం కరోనా ఫ్రీ దేశం అవుతుందని పేర్కొంది. అయితే జగన్, కేసీఆర్ మాత్రం మరి కొన్ని నెలల పాటు కరోనాతో సహజీవనం తప్పదని... కలిసి ప్రయాణం చేయక తప్పదని పేర్కొన్నారు. 
 
అయితే సింగపూర్ యూనివర్సిటీ అమెరికా, సింగపూర్, స్పెయిన్ లలో నమోదైన కేసులతో భారత్ లో నమోదైన కేసులను పోల్చి ఈ నెల చివరి వారం నాటికి దేశంలో కరోనా తగ్గుముఖం పడుతుందని ప్రకటన చేసింది. అయితే కేసీఆర్, జగన్ దేశంలో కేసుల సంఖ్య పెరిగిపోవడం, కరోనాకు వ్యాక్సిన్ లేకపోవడం వల్లే కరోనాతో కలిసి జీవించాలని వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
మరోవైపు చైనా వుహాన్ ను పూర్తిగా లాక్ డౌన్ చేసి కరోనాను కట్టడి చేయడంలో సక్సెస్ అయింది. అయితే మన దేశంలో లాక్ డౌన్ విధించినా కేంద్రం మొదటి నుంచి సడలింపులు ఇస్తూ వచ్చింది. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా అధిక సంఖ్యలో కేసులు నమోదు కాగా... ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనల వల్ల ఆ కేసుల సంఖ్య మరింత పెరిగింది. కొందరిలో కరోనా కనిపించకున్నా వారి నుంచి ఇతరులకు వ్యాప్తి చెందుతోంది. జగన్, కేసీఆర్ కరోనా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టకపోవడంతో ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు సింగపూర్ యూనివర్సిటీ అంచనాలు నిజమవుతాయో లేదో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: