కరోనా ను అరికట్టడం లో కేరళ జైత్రయాత్ర కొనసాగుతుంది. సౌత్ లోని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రోజు రోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుంటే  ఈరెండు రాష్ట్రాల కంటే ముందుగా ఎఫెక్ట్ అయినా కేరళ లో మాత్రం కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చింది. కేరళ లో గత మూడు రోజుల నుండి వరుసగా రెండు రోజులు జీరో కేసులు నమోదు కాగా నిన్న మాత్రం మూడు కేసులు నమోదయ్యాయి. ఇక ఈ రోజు మళ్ళీ జీరో  కేసులు నమోదు కావడంతో  రాష్ట్ర సర్కార్ ఊపిరి పీల్చుకుంది.  ప్రస్తుతం  అక్కడ కేవలం 30 కరోనా కేసులు మాత్రమే యాక్టీవ్ లో వున్నాయి. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇప్పటివరకు 502 కేసులు నమోదు కాగా అందులో 469 మంది కోలుకోగా ముగ్గురు మరణించారు. అయితే కరోనా ప్రభావం తగ్గినా కూడా లాక్ డౌన్ విషయంలో విజయన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు  వైన్స్ కూడా ఓపెన్ కాలేదు. 
ఇక తమిళనాడు లో మాత్రం రోజు రోజు కు పరిస్థితి దిగజారిపోతుంది. ఈఒక్క రోజే రాష్ట్ర  వ్యాప్తంగా 771 కరోనా కేసులు నమోదు కాగా ఇద్దరు మరణించారు. 31మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ముఖ్యంగా చెన్నై నగరం కరోనా దాటికి వణికిపోతుంది. మొత్తం  ఇప్పటివరకు తమిళనాడు లో 4829కేసులు నమోదు కాగా అందులో కేవలం చెన్నై లోనే 2328 కేసులు బయటపడ్డాయి. అయితే పరిస్థితి సీరియస్ గా వున్నా కూడా రేపటి నుండి అక్కడ వైన్స్ కూడా తెరుచుకోనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: