ఏపీలో మద్యం షాపులు ఓపెన్ చేయడంపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. అసలే లాక్ డౌన్ వల్ల పేద ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, మద్యం షాపులు ఓపెన్ చేయడమేంటి అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అలాగే వైన్ షాపుల దగ్గర సామాజిక దూరం కూడా పాటించడం లేదని మండిపడుతున్నారు. అయితే కేంద్రం పర్మిషన్ తోనే షాపులు ఓపెన్ చేశామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక షాపుల దగ్గర సామాజిక దూరం లేకపోవడానికి టీడీపీ నేతలే కారణమని, కావాలానే చంద్రబాబు డబ్బులిచ్చి, టీడీపీ కార్యకర్తలని లైన్లోనికి పంపించి సామాజిక దూరం లేకుండా చేయాలని చెప్పారని మంత్రి పేర్ని నాని లాంటి వారు మాట్లాడుతున్నారు.

 

ఇక మంత్రి మాటలకు టీడీపీ నేతల నుంచి కౌంటర్లు కూడా వస్తున్నాయి. మంత్రి అర్థంపర్ధం లేని విమర్సలు చేస్తున్నారని, టీడీపీ వాళ్ళు లైన్ లో ఉంటే వైసీపీ వాళ్ళు పల్లీలు అమ్ముతున్నారా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇదే క్రమంలో లైన్లో నిలుచున్నవాళ్లంతా టీడీపీ వాళ్లే అయితే 150 సీట్లు మాకే వచ్చేవని అంటున్నారు. అలాగే మద్యం షాపులు బదులు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తే బాగుంటుందని అంటున్నారు. అయితే ఇందులో  మద్యం షాపులు బదులు క్యాంటీన్లు ఓపెన్ చేయడం అనే పాయింట్ బాగానే ఉంది కానీ, మందుబాబులు వల్లే అన్ని సీట్లు వచ్చాయని అనడంలో  ఏ మాత్రం లాజిక్ లేదు. 

 

అయితే వైసీపీకి 151 సీట్లు వచ్చాయో ప్రజలకు తెలుసని, గత ఐదేళ్లు టీడీపీ అవినీతి పాలన, అరాచకాలు భరించలేకే జనం జగన్ ని సీఎం చేసారని వైసీపీ కార్యకర్తలు గుర్తుచేస్తున్నారు. రాష్టంలో 10 శాతం లోపే మద్యం తాగేవాళ్ళు ఉంటారని, కానీ మొత్తం ప్రజలు ఏకపక్షంగా నిలవడంతోనే అన్ని సీట్లు వచ్చాయని, ఆ విషయం టీడీపీ వాళ్ళు అర్ధం చేసుకుంటే మంచిదని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎవరి వల్ల ఎన్ని సీట్లు వస్తాయో తెలిపోతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: