కరోనా కట్టడి చేయడంలో సీఎం జగన్ తీవ్రంగా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ అధికారులతో సమీక్ష సమావేశాలు పెట్టి, ఎప్పటికప్పుడు పరిస్థితులని తెలుసుకుంటున్నారు.     ఈ క్రమంలోనే ఇటీవల జగన్ మాట్లాడుతూ..కరోనాతో పెద్దగా భయపడాల్సిన పని లేదని చెబుతూనే, కరోనాతో మనం కలిసి జీవించాలని మాట్లాడారు. అంటే జ్వరం మాదిరిగానే కరోనా కూడా ఉంటుందని ప్రజలకు వివరించారు.

 

అయితే జగన్ ఇలా మాట్లాడటంపై ప్రతిపక్షాలు ఎగతాళి చేశాయి. కరోనా కట్టడి చేయడంలో జగన్ ఫెయిల్ అయ్యారని మాట్లాడారు. అసలు జగన్ కరోనాని అరికట్టలేక చేతులెత్తేశారని అన్నారు. కానీ జగన్ వాస్తవాలు చెప్పారని, వ్యాక్సిన్ వచ్చేవరకు కరోనాతో కలిసి జీవించాలని వైసీపీ నేతలు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

 

ఇక జగన్ చెప్పిందే ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా చెబుతున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో కరోనాతో సహజీవనం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పింది అక్షర సత్యమని, ఇదే విషయాన్ని మిగతా రాష్ట్రాల సీఎంలు కూడా చెప్తున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అవేవి టీడీపీ నేతలకు కనపడవా అని అడిగారు. నిజానికి శ్రీకాంత్ రెడ్డి చెప్పింది కరెక్టే. ఇటీవల ఢిల్లీ సీఎం కూడా కేజ్రీవాల్, తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఇలాంటి మాటలే చెప్పారు. కానీ ఆ విషయం టీడీపీ నేతలకు అర్థంకాక ఎగతాళి చేశారు.

 

అటు గ్రామ సచివాలయాలకు వేసిన వైసీపీ రంగులు తీయమని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో దానిపై కూడా శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. టీడీపీ హయాంలో ప్రతి బిల్డింగ్‌కి పచ్చరంగులు వేసినప్పుడు, ఇప్పుడు వైఎస్‌ జగన్‌ హయాంలో రంగులపై చేస్తున్నట్లుగా ఎందుకు రాద్దాంతం చేయలేదని మండిపడ్డారు. ఆకుపచ్చ రంగు హరిత వనానికి, తెల్లరంగు శాంతికి, నీలం రంగు నీటి ప్రవాహానికి నాంది అని చెప్పారు. ఇలా రంగులు వేయడాన్ని సమర్థిస్తూ, గతంలో వేశారు, అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారనేది కరెక్ట్ కాదని, ఏ ప్రభుత్వంలోనైనా సరే ప్రభుత్వ భవనాలకు రంగులు వేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదని అని విశ్లేషుకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: