ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం వలస కార్మికుల విషయంలో గాని కరోనా వైరస్ వల్ల బాధపడుతున్న వ్యాధిగ్రస్తుల విషయంలో గానీ చాలా బాధ్యతాయుతంగా మెలుగుతుంది. కరోనా వైరస్ చికిత్స కోసం హాస్పిటల్లో ఉంటున్న రోగులకు పెడుతున్న ఫుడ్ బట్టి ఇది అర్థం అవుతుంది. మంచి ప్రోటీన్ కలిగిన ఫుడ్ అందిస్తూ ఏపీ ప్రభుత్వం చాలా కేర్ కరోనా రోగుల పట్ల తీసుకుంటుంది. అంతేకాకుండా హాస్పిటల్ కి ఎవరైతే పేద వాళ్ళు కరోనా వైరస్ తో బాధపడుతున్నారో వాళ్లు చికిత్స తీసుకున్న తర్వాత, కోలుకున్నక వట్టి చేతులతో పంపించకుండా వారికీ  రెండు వేల రూపాయలు సహాయం చేసి మరి ఇంటికి పంపిస్తున్నారు వైయస్ జగన్. ఈ విధంగా ఎక్కడికక్కడ ఒకపక్క ఆర్థికంగా అనేక ఇబబంధులు ఉన్న పేదవాడు నష్టపోకుండా జగన్ వ్యవహరిస్తున్నారు. ఇటువంటి సమయంలో విపక్షాలు దేని మీద రాజకీయం చేయాలో - చేయకూడదో అన్న దాని విషయంలో కూడా క్లారిటీ లేకుండా పోయింది.

 

ఏదో విధంగా ప్రభుత్వం చేస్తున్న మేలులు తమ అకౌంట్లో వేసుకోటానికి విపక్ష పార్టీల నాయకులు తెగ ఆరాటపడుతున్నారు. ముందుగా గుజరాత్ రాష్ట్రంలో ఇరుక్కుపోయిన మత్స్యకారుల విషయంలో గుజరాత్ ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి ఒక ఒప్పందానికి వచ్చి కొన్ని వేల మందిని రాష్ట్రానికి తీసుకురావటం జరిగింది. దాదాపు నలభై రోజులుగా కార్మికులు నానా అవస్థలు పడ్డారు. ఉత్తరాంధ్రకు చెందిన ఈ మత్స్యకారులు దాదాపు 3 వేల మంది దాకా ఉన్నారు. అయితే ఈ విషయంలో వైయస్ జగన్ ముందు నుండి అక్కడ ప్రభుత్వానికి తెలియజేసి వారి బాగోగులు చూడాలని కోరడం జరిగింది.

 

ఆ తరువాత వెంటనే రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. ఈ విషయంలో చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ క్రెడిట్ మొత్తం తమ ఖాతాలో పడ్డట్టే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరుని మెచ్చుకుంటే విపక్ష పార్టీలు మాత్రం ఇదంతా తమ క్రెడిట్ అంటూ తెగ డబ్బాలు కొడుతున్నాయి. ఈ తంతు మొత్తం చూసి ఏపీ జనాలు వీళ్లకి  ఎప్పుడు రాజకీయం చేయాలో ఎలా వ్యవహరించాలో కూడా తెలియదు అంటూ వీళ్లు చేస్తున్న అతికి నవ్వుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: