నిజమే చావు వచ్చిపడింది. అది ఎవరికో ఒకరికి కాదు, యావత్తు ప్రపంచానికే చావు వచ్చింది. కరోనాతో చావు వచ్చిపడింది. కరోనా మానవాళితో గేమ్స్ ఆడుతోంది. కాటేసేందుకు నేను సిధ్ధం అంటూ సవాల్ చేస్తఒంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా అది విలయతాండవం చేస్తోంది.

 

కరోనా విషయంలో ఇదిగో వ్యాక్సిన్ వస్తుంది. అదిగో వస్తుంది అని అంతా చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా  మూడువేలకు పైగా పరిశోధనలు జరుగుతున్నాయి. డిసెంబర్లో కరోన వ్యాక్సిన్ అని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అంటే ఇదిగో తొందరలోనే అని ఇటలీ అంటోంది. ఇక భారతీయ ఫార్మా రంగం కూడా కరోనా వైరస్ కి వ్యాక్సిన్ కనిపెట్టేపనిలో బిజీగా ఉన్నాయి.

 

ప్రజలు కూడా అదేదో వ్యాక్సిన్ వచ్చేస్తే కరోనా బారి నుంచి విముక్తి పొందవచ్చు అని ఎదురుచూస్తున్నారు. సరే ఇంతమంది ఇలా అనుకుంటున్నా  కూడా కరోనాను తరిమికొట్టే వ్యాక్సిన్ మీదనే అందరి చూపూ ఉంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం చావు కబురు చల్లగా చెబుతోంది. కరోనా వైరస్ కి ఇప్పట్లో వ్యాక్సిన్ రాదు అంటోంది.

 

ఆ సంస్థకు చెందిన శాస్త్రవేత్త డేవిడ్ నబారో మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ అని ఎదురుచూడవద్దు అది ఇప్పట్లో రాదని తేల్చేశారు. ప్రజలంతా కలసి జాగ్రత్తలు పాటిస్తూ కరోనాను తరిమికొట్టాల్సందేనని తన  సందేశం వినిపించారు. వ్యాక్సిన్ గురించి పరిశోధనలు జరుగుతున్నాయని, అవి ఒకవేళ ఫలించినా అయిదు దశలు దాటి జనాలకు చేరాలంటే ఎక్కువ టైం పడుతుందని కూడా అన్నారు.

 

ఇక ప్రపంచంలో చాలా రోగాలకు వ్యాక్సిన్ లేదని, ఎయిడ్స్ కి ఇప్పటికీ మందు లేదని, దాని వల్ల ఏటా 3.2 కోట్ల మంది చనిపోతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికి ఆయన చెప్పేది ఒక్కటే, వాక్సిన్ లేదు, కరోనా భయం ఇప్పట్లో వదలదు, అందువల్ల కలసి జీవించమని చెప్పడమే. నిజంగా ఇది షాక్ లాంటి వార్తే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: