కరోనా వైరస్ వల్ల ప్రపంచ దేశాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఇంకా ఈ వైరస్ కి మందు లేకపోవటంతో వ్యాక్సిన్ రాకపోవటంతో చాలావరకూ ప్రపంచంలో ఉన్న దేశాలు వైరస్ నియంత్రణ ఒకటే మార్గమని లాక్ డౌన్ ప్రకటించడం మనకందరికీ తెలిసిందే. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. మన దేశంలో కూడా లాక్ డౌన్ ప్రకటించడంతో నిత్యవసర వస్తువులు మినహా మిగిలిన అన్ని సంస్థలు మూతపడ్డాయి. కాలేజీస్ మరియు స్కూల్స్ కూడా క్లోజ్ అవ్వటంతో పదవతరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. అయితే ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవతరగతి పరీక్షలు జూన్ నెలలో నిర్వహించబోతున్నటు అప్పట్లో వార్తలు వచ్చాయి.

 

అయితే ఈ విషయంపై తాజాగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. పదవ తరగతి పరీక్షల విషయంలో మే 17 తర్వాత లాక్ డౌన్ ముగిసిన రెండు వారాల తర్వాత పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ ప్రకటించబోతున్నట్లు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ప్రస్తుతం టెన్త్ పరీక్షల షెడ్యూల్ అంటూ సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం అవాస్తవమని మంత్రి సురేష్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో పదవతరగతి పరీక్షలు మే 17 తర్వాత మూడు రోజులు తర్వాత ప్రభుత్వం నిర్వహించబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

 

అయితే ఈ వార్తలు విని చాలా మంది పదవ తరగతి విద్యార్థులు తెగ ఆందోళన చెందారు. తాజాగా జగన్ సర్కార్ మే 17 తర్వాత రెండు వారాల తర్వాత ఏ విషయమో చెబుతున్నట్లు స్పష్టం చేయడంతో జగన్ కి థాంక్స్ చెబుతున్నారు పదవ తరగతి స్టూడెంట్స్. అంతేకాకుండా పరీక్షలు నిర్వహణ విషయంలో కూడా పలు జాగ్రత్తలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పరీక్ష హాల్లో కేవలం 12 విద్యార్థులు మాత్రమే పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోబోతున్నారు. అంతే కాకుండా విద్యార్థులకు మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండేవిధంగా పరీక్షలు నిర్వహించాలని జగన్ సర్కార్ డిసైడ్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: