చైనా.. కరోనా అదేంటో ఈ రెండూ కలిపి చదువుకోవడం అందరికీ అలవాటు అయిపోయింది. ముఖ్యంగా అమెరికా చైనాను ఈ విషయలో దులిపిపారేస్తోంది. చైనా నుండే కరోనా వైరస్ ప్రపంచానికి పాకిందని ట్రంప్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. చైనాను బోనులో నిలబెడదామని అంటున్నారు.

 

సరే అమెరికా ఆధారాలు, బోనులో నిలబెట్టడాలు సంగతి పక్కన పెడితే ఈ మాటలు చాలు చైనాకు ఎంత హాని చేయాలో అంతా చేశాయి. ప్రపంచ మార్కెట్ లో భారీ వాటా కలిగిన చైనాలో ఎన్నో కంపెనీలు పనిచేస్తున్నాయి. లక్షల కోట్ల పెట్టుబడులు అక్కడ ప్రపంచ దేశాలు పెడుతున్నాయి.

 

ఇపుడు కరోనా మహమ్మారి వీర విహారం చేయడం అది కూడా చైనా నుంచే రావడంతో అక్కడ ఇతర దేశాల కంపీనీలు అంతా భయపడిపోతున్నారుట. ఇకమీదట చైనా సేఫ్ కంట్రీ కాదని కూడా భావిస్తున్నారుట. చైనాను వదిలి వెళ్ళిపోయేదాక రెడీ అవుతున్నారుట. వేయి వరకూ కంపీనీలు ఈ విధంగా చైనాకు టాటా చెప్పేసేందుకు రెడీ అవుతూండడంతో డ్రాగాన్ పరేషాన్ అవుతోందిట.

 

ఇంతకాలం దర్జా ఒలకబోసిన చైనాకు ఇపుడు బుర్రతిరిగిపోతోందిట. మతి తప్పి గందరగోళంలో పడుతోందిట. భయం కరోనాది, కారణం చైనా అని అనుమానం. మొత్తానికి చైనా ఎన్ని చెప్పినా ఎవరూ వినడంలేదుట. ఈ పరిణామాలు భారత్ కి అనుకూలించేవేనని అంటున్నారు. వాటిని అందిపుచ్చుకుని కనుక ముందుకు సాగితే రేపటి భారతం దివ్యంగా ఉంటుందని మన దేశం భావి నిర్దేశకులు అంటున్నారు.

 

ఇప్పటికే భారత్ ఆ పనిలో బిజీగా ఉంది. చైనా నుంచి బయటకు రావాలనుకుంటున్న కంపెనీలకు రెడ్ కార్పెట్ పరచేందుకు మోడీ సర్కార్ రెడీ అవుతోంది. అందుకు అవసరం అయిన భూమిని, ఇతర సదుపాయాలను ఇచ్చేందుకు కూడా సిధ్ధంగా ఉంది. మరి చైనా గడప దాటి వచ్చే పెట్టుబడులు భారత్ ని బంగారం చేస్తాయనడంతో సందేహం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: