లాక్ డౌన్ ఎన్నిసార్లు పొడిగించిన దేశంలో కరోనా వైరస్ కంట్రోల్ కావడం లేదు. రోజురోజుకీ కేసులు మరియు మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ప్రకటించడం జరిగింది. లాక్ డౌన్ సమయములో దేశవ్యాప్తంగా వలస కూలీల అవస్థలు చూసిన కేంద్రం వారికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఆర్థిక వ్యవస్థను కాపాడే విధంగా కొన్ని వెసులుబాట్లు ఇటీవల కల్పించడం మనకందరికీ తెలిసినదే. కొన్ని కొన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులు ఇవ్వొచ్చని కేంద్రం చెప్పుకొచ్చింది. ఏదో రకంగా దేశవ్యాప్తంగా ఖాళీ కడుపులను నింపాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. ఉపాధి లేక కుటుంబాన్ని నెట్టుకు రాలేక చాలామంది బాధపడుతున్నట్లు ఇటీవల లెక్కలు అంతర్జాతీయ మీడియా సంస్థలో బయటపడ్డాయి.

 

ఈ పరిణామంతో ప్రజల ఆరోగ్యం మేరకు అదే విధంగా ఉపాధి మేరకు ఆలోచిస్తూ కేంద్రం కొన్ని సడలింపు ఇస్తూ గ్రామీణ మరియు వ్యవసాయ రంగాల్లో పాటు ఆక్వా పరిశ్రమల్లో కూడా పనులకు వెసులుబాటు కల్పించింది. మూడో దశ లాక్ డౌన్ ముందు కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్ కి హెచ్చరికలు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వేసవి కాలం మొత్తం దేశవ్యాప్తంగా ప్రజలంతా లాక్ డౌన్ సరిగ్గా పాటించడం ఉత్తమమని అంటుందట.

 

ఏ మాత్రం భారత్ లో వైరస్ విజృంభిస్తే...పైగా వచ్చేది వర్షాకాలం కావడంతో విస్తరించే అవకాశం ఎక్కువగా ఉందని అంటుంది. అదే కనుక జరిగితే ఇండియాలో చావులు డబల్ అయ్యే అవకాశం ఉందని...వర్షాకాలం తర్వాత శీతాకాలం మరీ దారుణంగా వైరస్ బలపడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. లాక్ డౌన్ మే నెల అంతా ఇండియాలో పగడ్బందీగా వ్యవహరిస్తే భవిష్యత్తు కి తిరుగు ఉండదని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: