కేసీయార్ లో ఉద్యమకారుడు ఉన్నాడు. అదే సమయంలో  చతురత కలిగిన రాజకీయ నాయకుడు ఉన్నాడు. నిజానికి ఈ రెండింటినీ కలపడం చాలా కష్టం. ఉద్యమ నాయకులు ఎవరూ రాజకీయాల్లో రాణించలేరు. రాజకీయ నాయాకులు ఉద్యమాలు చేయలేరు. కానీ కేసీయార్ లో గొప్పతనం అదే. ఆయన అరుదైన నాయకుడుగా అందుకే కనిపిస్తారు. 

 

కేసీయార్ ఆరేళ్ళుగా  రెందు దఫాలుగా తెలంగాణాకు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన మొత్తం తెలంగాణాను టీయారెస్ ఆధీనంలోకి తెచ్చేశారు. కేసీయార్ కి ఎదురునిలిచే మొనగాడు ఎవరూ లేరని కూడా చాటుకున్నారు. ఆయన బలమైన నాయకుడిగా అక్కడ కనిపిస్తున్నారు. సమీప భవిష్యత్తులో మరో నేత ఢీ కొట్టి టీయారెస్ ని గద్దె దించుతారని ఎవరూ ఊహించడంలేదు.  

 

దాంతో కేసీయార్ ద్రుష్టి జాతీయా రాజకీయాల మీద పడింది. నిజానికి ఆయన 2019 ఎన్నికల్లోనే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నారు. కూటమి కూడా కట్టారు.  కానీ మోడీ బంపర్ మెజారిటీతో గెలిచి మరోమారు ప్రధాని పీఠమెక్కారు. దాంతో కేసీయార్ తెలంగాణాకే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక ఆయన చూపు 2024 మీద ఉంది.

 

ఎన్ని చెప్పుకున్నా కూడా 2024లో బీజేపీకి పూర్తి మెజారిటీ రాదని కేసీయార్ గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఆయన మోడీని ఢీ కొడుతున్నారు. కరోనా వేళ, లాక్ డౌన్ పెట్టి రాష్ట్రాల  నడ్డి విరిచిన కేంద్రం కనీసమాత్రంగా కూడా ఆర్ధిక‌  సాయం చేయడంలేదని కేసీయార్ అందుకే మోడీని కడిగేశారు.  

 

వారికి అర్ధమవ్వాలని ఇంగ్లీషులోనే గట్టిగా మాట్లాడారు. అంటే మోడీకి దేశంలో గట్టి గొంతుకని వినిపించేది తానేనని కేసీయార్ చెప్పుకుంటున్నారన్నమాట. ఇక కేసీయార్ ఫెడరల్ ఫ్రంట్ కల అలాగే ఉంది. ఆయనకు ఏపీ సీఎజ్ జగన్ మీద నమ్మకం ఉంది. జగన్ తో పాటు మరికొందరిని భాగస్వాములుగా చేసి 2024 నాటికి జాతీయ స్థాయిలో గట్టిగా పోరాడి ఫ్రంట్ ని అధికారంలోకి తీసుకురావాలనుకుంటున్నారు.  

 

మరి ఆయన కల నెరవేరుతుందా. ఏమైనా కేసీయార్ గట్టి నాయకుడు. ఆయన గెలుపు కోసం అలుపెరగని పోరాటం చేస్తారు. అందుకే ఆయన తన ప్రతీ అడుగూ అటువైపుగానే వేస్తున్నారు. రాబోయే కాలానికి జాతీయ స్థాయిలో  చేసేది భారీ యుధ్ధమేనని చెప్పకనే చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: