ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో పోరాడుతుంది. ఈ మహమ్మారి నుండి ఎలా బయటపడాలో అనేక మార్గాలు వెతుకుతుంది. వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి. ఈ వైరస్ మహమ్మారిని ఎలా అదుపు చేయాలో దేశాలన్నీ మందు కనిపెట్టే విషయంలో వ్యాక్సిన్ తీసుకురావడం విషయంలో అనేక ప్రయత్నాలు రాత్రింబగళ్ళు చేస్తున్నాయి. శాస్త్రవేత్తలు పూర్తిస్థాయిలో పరిశోధనలు జరుపుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే మరో పక్క ప్రభుత్వాలు  మాత్రం మందు అమ్మకాలకు పర్మిషన్ ఇచ్చేయడం పట్ల అంతటా విమర్శలు వస్తున్నాయి. దాదాపు మార్చి నెల నుండి మే నెల ప్రారంభం వరకు దేశంలో ఎక్కడా కూడా మద్యం షాపులు ఓపెన్ కాలేదు. ఇలాంటి తరుణంలో మూడోదశ లాక్ డౌన్ పొడిగింపు విషయంలో కేంద్రం మద్యం దుకాణాలకు సడలింపులు విధించడంతో మందుబాబులు రెచ్చిపోతున్నారు.

 

మద్యం దుకాణాల ముందు ఎక్కడా కూడా భౌతిక దూరం పాటించకుండా ఎగబడుతున్నారు. గతంలో స్టార్ హీరో సినిమా టికెట్ల కోసం తన్నుకుని, తోసుకునే దృశ్యాలే ప్రస్తుతం మందు షాప్స్ ముందు కనిపిస్తున్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎక్కడ చూసినా బార్ల ముందు కిలోమీటర్ల కొద్దీ లైన్లే కనిపించాయి. బెంగళూరులో అయితే అమ్మాయిలు కూడా లైన్ లో నిలబడి మరీ కావాల్సిన సరుకు బాటిల్ కొనుక్కొని వెళ్లడం చూసి పెద్ద తరం ముక్కును వేలేసుకుంది. పర్మిషన్ వచ్చిన మొదటి రోజుల్లోనే చాలా వరకు మందు మధ్యాహ్నానికి ఖాళీ అయిపోయింది.

 

షాపులు తెరిచిన తొలిరోజే రాష్ట్ర ప్రభుత్వాలకు కోట్లలో ఆదాయం సమకూరింది. ఈ విషయం పక్కన పెడితే వైద్య నిపుణులు ఈ విధంగానే వ్యవహరిస్తే కరోనా వైరస్...ఈజీగా మద్యం దుకాణాలకు వెళ్లి అంటించ్చుకోవచ్చు అని అంటున్నారు. ఏ ఒక్కరి వల్ల షాపు యజమాని కి వచ్చిన, మద్యం అమ్ముతున్న ఒక వ్యక్తి కి వచ్చినా అతని దగ్గర మద్యం కొనుగోలు చేసే వ్యక్తికి రావటం గ్యారెంటీ అని అంటున్నారు. ఈ విషయంలో మందుబాబులు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వ్యవహరిస్తే తనని తన కుటుంబాన్ని కాపాడుకున్నట్లు అవుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.  

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: